Viral News: ఏంటీ.. ఓడలాంటి ఇల్లు కావాలా..? కూలోళ్లకు ఇవ్వడానికైనా డబ్బులున్నాయా..? అని ఇంజనీర్లే హేళన చేశారు.. చివరకు..!

ABN , First Publish Date - 2023-04-12T17:51:40+05:30 IST

జీవితంలో ప్రతీ వాడికి ఓ కల ఉంటుంది. బాగా స్థిరపడాలి. ఇల్లు కట్టుకోవాలి. కారు కొనుక్కోవాలి. ఇలా రకరకాలైన ఆలోచనలు ఉంటాయి. కొంత మందికి నెరవేరుతుంటాయి. మరికొందరికి కలగానే మిగిలిపోతాయి.

Viral News: ఏంటీ.. ఓడలాంటి ఇల్లు కావాలా..? కూలోళ్లకు ఇవ్వడానికైనా డబ్బులున్నాయా..? అని ఇంజనీర్లే హేళన చేశారు.. చివరకు..!
Viral News

జీవితంలో ప్రతీ వాడికి ఓ కల ఉంటుంది. బాగా స్థిరపడాలి. ఇల్లు కట్టుకోవాలి. కారు కొనుక్కోవాలి. ఇలా రకరకాలైన ఆలోచనలు ఉంటాయి. కొంత మందికి నెరవేరుతుంటాయి. మరికొందరికి కలగానే మిగిలిపోతాయి.

కొంత మందికి ఆశలుంటాయి. పక్కవాళ్ల బిల్డింగ్ చూసో.. వాళ్ల వాహనాలు చూసో.. అలాగే కొనుక్కోవాలని కోర్కెలు పడుతుంటాయి. ఇవి ప్రతీ మనిషికి సర్వసాధారణమే. కొంత మంది స్థోమతను బట్టి నెరవేర్చుకుంటారు. మరికొందరు తమ సామర్థ్యం మేరకు నెరవేర్చుకుంటారు. ఇలా రెండు రకాలైన మనుషులు ఉంటారు.

కృషి ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించాడు కోల్‌కతాకు చెందిన మింటు రాయ్. తన కలల ప్రాజెక్ట్‌ను నిర్మించి ప్రశంసలు పొందుతున్నాడు. అందుకే అంటారు. ఏ పనైనా తెగించి రంగంలోకి దిగితేనే సాధ్యం అవుతుందంటారు పెద్దలు. అలాగే సాహసించాడు మింటు రాయ్.

మింటు రాయ్ కోల్‌కతా (Kolkata)లో నివసించేటప్పుడు.. ఓడలా కనిపించే ఓ ఇల్లును (ship house) కట్టుకోవాలని కలలు కన్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం చాలా మంది ఇంజనీర్లను సంప్రదించాడు. అయితే ఎవరూ మింటు రాయ్‌ను పట్టించుకోలేదు. దీంతో స్వయంగా ఇల్లు కట్టుకోవడం తప్ప మరో మార్గం లేదని అర్థమైంది. అంతే తాను నివసిస్తున్న.. హెలెంచా జిల్లా సిలిగురిలోని ఫసిదావా ప్రాంతంలో మింటు మెల్లగా తన కలల ప్రాజెక్ట్‌కు జీవం పోయడం ప్రారంభించాడు. 2010లో ఈ ఇంటి నిర్మాణం మొదలు పెట్టాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు కారణంగా అప్పుడప్పుడు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కనీసం తాపీ మేస్త్రీలకు కూడా చెల్లించేంతా డబ్బు కూడా మింటు దగ్గర లేవు. దీంతో మూడేళ్ల పాటు నేపాల్ వెళ్లి తాపీ పని నేర్చుకున్నాడు. అనంతరం వచ్చీ 30 అడుగుల ఎత్తులో అత్యంత ఆకర్షణీయంగా ఇల్లు నిర్మించాడు.

hi.jpg

ఈ ఇల్లు 39 అడుగుల పొడవు. 13 అడుగుల వెడల్పుతో నిర్మించబడింది. ఈ ఇల్లు ఆ ప్రాంతానికే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. టైటానిక్ హౌస్‌కి స్వాగతం అంటూ ఓ ఫొటో వైరల్ (Viral News) అవుతోంది. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శెభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇంటి నిర్మాణం కోసం మింటూ వ్యవసాయం చేస్తున్నాడు. ఆ డబ్బును పొదుపు చూసి తన కలల ఇంటిని నిర్మిస్తున్నాడు. అందుకే అంటారు పెద్దలు.. కృషి ఉంటే ఏదైనా సాధించొచ్చని.

ఇది కూడా చదవండి: Lottery: లాటరీలో గెలిచింది రూ.328 కోట్లు.. కానీ అతడికి వచ్చింది మాత్రం కేవలం రూ.174 కోట్లే.. ఇంత తేడా ఎందుకంటే..!

ఇది కూడా చదవండి: Viral Video: వారెవ్వా.. ఏం ట్రైనింగ్ ఇచ్చావు బాసూ.. కుర్రాడితో బ్యాట్మింటన్ ఆడుకుంటున్న మూడు పిల్లులు..!

ఇది కూడా చదవండి: అన్నీ మర్చిపోదాం.. ఇంటికి రండని పిలిస్తే.. ప్రేమ పెళ్లయిన 4 ఏళ్లకు భార్యతో సహా ఇంటికి వెళ్లాడా భర్త.. 10 రోజుల తర్వాత..

Updated Date - 2023-04-12T17:52:23+05:30 IST