Indian Railway: రైల్లో టికెట్లను చెక్ చేస్తున్న టీటీఈ.. సడన్‌గా పోలీసుల ఎంట్రీతో అతడిలో కంగారు.. చివరకు ఊహించని ట్విస్ట్..!
ABN , First Publish Date - 2023-12-06T11:35:35+05:30 IST
Indian Railway News: కేరళలోని మలప్పురం జిల్లాలో లోకల్ ట్రైన్‌లో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. లోకల్ రైలులో టికెట్లు చెక్ చేస్తున్న ఓ ట్రైన్ టికెట్ ఇన్‌స్పెక్టర్ (TTE).. సడన్‌గా పోలీసుల ఎంట్రీతో కంగారు పడ్డాడు. చివరకు ఊహించని ట్విస్ట్ ట్రైన్‌లోని ప్రయాణీకులను షాక్ అయ్యేలా చేసింది.
Indian Railway News: కేరళలోని మలప్పురం జిల్లాలో లోకల్ ట్రైన్‌లో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. లోకల్ రైలులో టికెట్లు చెక్ చేస్తున్న ఓ ట్రైన్ టికెట్ ఇన్‌స్పెక్టర్ (TTE).. సడన్‌గా పోలీసుల ఎంట్రీతో కంగారు పడ్డాడు. చివరకు ఊహించని ట్విస్ట్ ట్రైన్‌లోని ప్రయాణీకులను షాక్ అయ్యేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మలప్పురం జిల్లాలోని ఓ లోకల్ ట్రైన్‌లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో నడిచే లోకల్ రైళ్లలో చాలాకాలంగా మంకాడకు చెందిన మహమ్మద్ సుల్ఫీకర్ (28) అనే వ్యక్తి టీటీఈ రూపంలో ప్రయాణీకుల టికెట్లు చెక్ చేస్తున్నాడు. ఎవరైనా టికెట్లు లేకుండా ప్రయాణించడం చేస్తే జరిమానాలు కూడా వసూలు చేస్తున్నాడు. ప్రతిరోజూ టిప్‌టాప్‌గా రెడీ అయ్యి తన ఇంటికి దగ్గరిలోని రైల్వే స్టేషన్లకు చేరుకునేవాడు సుల్ఫీకర్. ఈ క్రమంలో అతని ప్రవర్తనపై కొంతమంది ప్రయాణీకులకు అనుమానం వచ్చింది. దాంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అతనిపై అధికారులు నిఘా పెట్టారు.
ఇది కూడా చదవండి: Viral: ఈ ఫొటోలోని మహిళ రెండు కాళ్లను ఎందుకు తీసేయాల్సి వచ్చిందో తెలిస్తే..!
ఈ క్రమంలో సోమవారం కూడా సుల్ఫీకర్ యధావిధిగా చెరుకర, అంగడిపురం మధ్య నడిచే నిలంబూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (Nilambur Special Express) రైలులో టీటీఈగా టికెట్లు చెక్ చేస్తున్నాడు. ఆ విషయం తెలుసుకున్న ఆర్‌పీఎఫ్ అధికారులు సడన్‌గా ఆ ట్రైన్‌లో ఎంట్రీ ఇచ్చారు. అంతే.. వారిని చూడగానే సుల్ఫీకర్ కంగారు పడిపోయాడు. అధికారుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. చివరికి అధికారులు అతణ్ని ట్రైన్‌లోనే వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఇక టీటీఈని అధికారులు అదుపులోకి తీసుకోవడం చూసిన రైలులోని ప్రయాణీకులకు మొదట అసలేమీ అర్థం కాలేదు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయారు. ఎందుకంటే.. సుల్ఫీకర్ అసలు టీటీఈనే కాదు. రైల్వే సంస్థకు చెందిన నకిలీ ఐడీ కార్డుతో అతడు ఇలా టీటీఈగా మారి విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రయాణీకుల వద్ద డబ్బులు కూడా వసూలు చేశాడు. ఇక సుల్ఫీకర్‌ను అదుపులోకి తీసుకున్న ఆర్పీఎఫ్ బృందం విచారణ అనంతరం నిందితుడిని షోరనూర్ రైల్వే పోలీసులకు అప్పగించింది. సుల్ఫీకర్‌పై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
ఇది కూడా చదవండి: Viral Video: ఇద్దరు పిల్లల మధ్య పదే పదే గొడవ.. ఒకే ఒక్క చిట్కాతో ఆ తల్లి ఎలా ఆపేసిందో చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం..!
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.