Viral Video: కొంగ-ఆరిఫ్ కథలాగే మరో అరుదైన బంధం.. ఈ కుర్రాడిని వదిలి పెట్టని ఆవు.. సెల్ఫీలు తిగుతోంటే ఫోజులు కూడా పెడుతోంది..!

ABN , First Publish Date - 2023-04-13T16:58:34+05:30 IST

ఆ మధ్య ప్రమాదంలో గాయపడిన కొంగను కాపాడి కంటికిరెప్పాలా చూసుకున్న ఆరిఫ్ సంఘటన గుర్తుందా? ఆ సంఘటన తర్వాత

Viral Video: కొంగ-ఆరిఫ్ కథలాగే మరో అరుదైన బంధం.. ఈ కుర్రాడిని వదిలి పెట్టని ఆవు.. సెల్ఫీలు తిగుతోంటే ఫోజులు కూడా పెడుతోంది..!
Viral Video

ఆ మధ్య ప్రమాదంలో గాయపడిన కొంగను కాపాడి కంటికిరెప్పాలా చూసుకున్న ఆరిఫ్ సంఘటన గుర్తుందా? ఆ సంఘటన తర్వాత ఆరిఫ్‌కు కొంగ మధ్య ఎలాంటి స్నేహం ఏర్పడిందో మనందరికీ తెలిసిందే. ఆరిఫ్ ఎక్కడికెళ్లినా అతన్నే అనుసరిస్తూ వెళ్లేది. ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం అమేథీలో (Amethi) జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఈ మధ్య తెగ వైరల్ అయింది. అంటే చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకునేవారు మనుషుల్లో ఉండకపోవచ్చు గానీ.. జంతువులు, పక్షుల్లో కృతజ్ఞతా భావం చాలా ఎక్కువగా ఉంటుందని నిరూపించింది ఆ కొంగ. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? సేమ్ అదే మాదిరిలాంటి సంఘటన తాజాగా వైరల్ (Viral Video) అవుతోంది.

సెల్ఫీ (selfie) అనేది ఇప్పుడొక ఫ్యాషన్.. ఎక్కడకెళ్లినా గుర్తుండిపోయేలా సెల్ఫీలు తీసుకుంటారు. వాటిని వాట్సాప్ స్టేటస్‌ల్లోనూ.. లేదంటే సోషల్ మీడియాలోనూ పెట్టుకుంటారు. అచ్చం అలాగే వివేక్ అనే యువకుడు కూడా స్మైల్ ఫ్లీజ్ అన్నాడు. అంతే ఇది కూడా పెద్ద వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ సెల్ఫీ ఏంటి? దాని కథేంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

వివేక్ తీసుకున్న సెల్ఫీలో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నరా? సెల్ఫీ కోసం వివేక్ తన ఆవుతో స్మైల్ ఫ్లీజ్ అన్నాడు. అంతే ఆ ఆవు అందంగా.. క్యూట్‌గా సెల్ఫీకి ఫోజులిచ్చేసింది. అలా ఆవు (cow)తో వివేక్ సెల్ఫీ తీసుకున్నాడు. అనంతరం ఈ సెల్ఫీ వీడియోను వివేక్ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశాడు. అది కాస్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ ( social media) అవుతోంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొంత మంది చాలా బాగుంది అంటూ ప్రశంసిస్తే... ఇంకొకరు ఇలాంటి ఫ్రెండ్ నాకు ఉంటే బాగుండును అని వ్యాఖ్యానించాడు. మరికొందరు జై గోమాత, వందే మాతరం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 4 లక్షల 60 వేలు లైకులు రాగా.. 22 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.

ఇది కూడా చదవండి: ఈ ఒక్క దున్నతో నెలకు రూ.9.60 లక్షల సంపాదన.. అసలు దీని ఖరీదు ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!

ఇది కూడా చదవండి: Viral News: బాబోయ్.. ఈ పిల్లాడి పట్టుదల మామూలుగా లేదుగా.. తల్లిపై ఫిర్యాదు చేసేందుకు ఏకంగా 130 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కాడు..!

Updated Date - 2023-04-13T16:58:34+05:30 IST