Viral News: బ్రేకప్ చెప్పింది.. కానీ డబ్బులు తిరిగివ్వడం లేదట.. విసుగొచ్చి ప్రియుడు చేసిన పనితో ప్రేయసికి మైండ్‌బ్లాక్..!

ABN , First Publish Date - 2023-04-08T12:26:57+05:30 IST

వారిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. మనస్పర్థలు రావడంతో విడిపోయారు.

Viral News: బ్రేకప్ చెప్పింది.. కానీ డబ్బులు తిరిగివ్వడం లేదట.. విసుగొచ్చి ప్రియుడు చేసిన పనితో ప్రేయసికి మైండ్‌బ్లాక్..!

ఇంటర్నెట్ డెస్క్: వారిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే, మంచిగా ఉన్నప్పుడు ప్రియురాలికి (Girlfriend) అవసరం ఉందంటే కొంత నగదు ఇచ్చాడు. బ్రేకప్ (Breakup) తర్వాత ఆ డబ్బు అడిగితే ఆమె తిరిగి ఇవ్వకపోగా, కొత్త ప్రియుడితో కలిసి బెదిరింపులకు దిగింది. దాంతో ఆ యువకుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. నా డబ్బులు ఎలా ఇవ్వవో చూస్తాని ప్రేయసికి దిమ్మతిరిగే పని చేశాడు. దాంతో ఆమె దెబ్బకు దిగొచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బిహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్ (Muzaffarpur) పరిధిలోని సర్దార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ యువకుడు డయల్ 112 ద్వారా పోలీసులకు ఫోన్ చేసి తనకు సాయం చేయాల్సిందిగా కోరాడు. అయితే, ఆ యువకుడు చెప్పిన విషయం విని మొదట పోలీసులు కంగుతిన్నారు. తాను ఓ అమ్మాయిని ప్రేమించానని, ఆమె తన వద్ద రూ.30వేలు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని, ఎలాగైనా మీరే ఇప్పించాలని పోలీసులతో అన్నాడు. తన డబ్బు తనకు తిరిగివ్వాలని అడిగితే కొత్త ప్రియుడితో (Boyfriend ) కలిసి తనను బెదిరిస్తున్నాడని వాపోయాడు. దాంతో పోలీసులు అతడి వద్ద నుంచి ఆ యువతి ఫోన్ నంబర్ తీసుకుని ఎంక్వైరీ చేశారు. లవ్‌లో ఉన్నప్పుడు అతడు తనకు నగదు ఇచ్చిన మాట వాస్తవమేనని ఆమె చెప్పింది. కానీ, అందులో ఇప్పటికే రూ.20వేలు రిటర్న్ చేసినట్లు తెలిపింది. మిగతా డబ్బు సాధ్యమైనంత త్వరగా ఇచ్చేస్తానని చెప్పుకొచ్చింది. ఇలా ప్రియుడు పోలీసుల వద్దకు వెళ్లి ఊహించని షాక్ ఇవ్వడంతో ప్రేయసికి మైండ్‌బ్లాక్ అయింది.

Viral Video: నీకు హ్యాట్సాఫ్ బ్రదర్.. రోడ్డు పక్కన టేబుల్ వేసి.. అన్నం కూరలు అమ్ముతున్న ఈ కుర్రాడెవరో.. అతడి కథేంటో తెలిస్తే..


Updated Date - 2023-04-08T12:26:57+05:30 IST