Bride: కొత్త కోడలి వింత నిర్వాకం.. ఇదేం పనంటూ నిలదీసిన భర్త.. పెళ్లయిన 15 రోజులకే పోలీసుల వద్ద పంచాయితీ.. చివరకు..!
ABN , First Publish Date - 2023-06-02T18:23:27+05:30 IST
రోజు రోజుకూ కుటుంబ విలువలు దిగజారిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావమో.. లేదంటే సినిమాల ప్రభావమో తెలియదు గానీ.. భార్యాభర్తల మధ్య రిలేషన్‌షిప్ నానాటికీ సన్నగిల్లిపోతున్నాయి. మొబైల్ వాడడం
రోజు రోజుకూ కుటుంబ విలువలు దిగజారిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావమో.. లేదంటే సినిమాల ప్రభావమో తెలియదు గానీ.. భార్యాభర్తల మధ్య రిలేషన్‌షిప్ నానాటికీ సన్నగిల్లిపోతున్నాయి. మొబైల్ వాడడం తప్పేమీ కాదు. కానీ దానితోనే గంటల తరబడి టైమ్‌పాస్ చేస్తే మాత్రం ఇబ్బందే. ఇదంతా ఎందుకంటారా? ఓ ఫోన్ పచ్చని సంసారంలో చిచ్చురేపింది. ఎందుకు? ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
సోషల్ మీడియా వచ్చాకు ఎక్కువగా దానితోనే కాలక్షేపం చేస్తున్నారు. గంటల తరబడి కాలం గడిపేస్తున్నారు. టెక్నాలజీని వాడుకోవడంలో తప్పేమీ లేదు గానీ దాని వ్యామోహంలో కూరుకుపోతే జీవితాలు దెబ్బతింటాయి. ఇప్పుడు ఇదే కొత్త జంట కాపురంలో చిచ్చు పెట్టింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ (FB, Instagram) వాడొద్దు అన్నందుకు ఓ మహిళ కట్టుకున్న భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ సంఘటన బీహార్‌లోని హాజీపూర్‌లో (Bihar Hajipur) చోటుచేసుకుంది.
15 రోజుల క్రితం ఆ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అత్తారింట్లోకి అడుగుపెట్టిన కోడలు ఎవరిని పట్టించుకోకుండా సొంత వ్యాపకంలో మునిగిపోయింది. పైగా ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా గంటల తరబడి ఫోన్‌లోనే కూర్చుంటుందని అత్తమామలు వాపోయారు. ఈ విషయమై భార్య, భర్తల మధ్య పెద్ద గొడవే జరిగింది. కోడలు.. పుట్టింటి వారికి చెప్పడంతో వారు వచ్చి దాడి చేయడంతో ఈ వివాదం మరింత ముదిరి పాకానపడింది.
నవ వధువు (Bride) తన సోదరుడిని రెచ్చగొట్టి భర్తపైకి (husband) గొడవకు పంపింది. ఆ వ్యక్తి తుపాకీతో వచ్చి మరీ బావను చంపుతానంటూ బెదిరించాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని గొడవను పరిశీలించారు. అనంతరం వధువు సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అమ్మాయి తరపున బంధువులు కూడా తమ వాదనలు వినిపించారు. అత్తమామలు తమ కూతురు ఫోన్‌ను తీసుకెళ్లారని, తమతో మాట్లాడేందుకు కూడా అనుమతించడం లేదని ఆరోపించారు. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం కొంత సద్దుమణిగింది. కానీ అమ్మాయి మాత్రం అత్తమామలతో ఉండేందుకు అంగీకరించలేదు. అంతే కాదు.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను వాడకుండా ఉండలేనని తేల్చి చెప్పింది. భర్త.. అత్తామామలతో రాజీ పడలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.