Viral News: రైలు పట్టాల పక్కనే 70 ఏళ్ల బామ్మ.. చేతిలో ఎర్రటి వస్త్రం.. కంగారు పడుతూనే ట్రైన్ బ్రేకులు వేసిన లోకో పైలెట్.. వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2023-04-05T17:18:36+05:30 IST

ఆమె 70 ఏళ్ల వృద్ధురాలు. పైగా గుండె ఆపరేషన్ చేసుకుంది. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అయినా కూడా ప్రాణాలు తెగించి రైలు పట్టాలపైకి వచ్చింది. ఇంతకీ ఆమె పట్టాల పైకి ఎందుకొచ్చిందీ. విషయం తెలిశాక ఆమెను

Viral News: రైలు పట్టాల పక్కనే 70 ఏళ్ల బామ్మ.. చేతిలో ఎర్రటి వస్త్రం.. కంగారు పడుతూనే ట్రైన్ బ్రేకులు వేసిన లోకో పైలెట్.. వెళ్లి చూస్తే..
Viral News

ఆమె 70 ఏళ్ల వృద్ధురాలు. పైగా గుండె ఆపరేషన్ చేసుకుంది. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అయినా కూడా ప్రాణాలు తెగించి రైలు పట్టాలపైకి వచ్చింది. ఇంతకీ ఆమె పట్టాల పైకి ఎందుకొచ్చిందీ. విషయం తెలిశాక ఆమెను ప్రశంసించకుండా ఉండలేరు. ఈ వివరాలేంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

అది 2023 మార్చి 21. సమయం మధ్యాహ్నం 2.10 గంటల సమయం. అదే సమయంలో మత్స్యగంధ రైలు వచ్చే సమయం. ఆ టైంలోనే ఓ భారీ వృక్షం అమాంతంగా విరిగి పడి రైలు పట్టాలపై పడింది. దీన్ని గమనించిన వృద్ధురాలు చంద్రావతి (old woman) కంగారు పడింది. అదే సమయంలో ఇంకోవైపు రైలు కూత వినపడింది. ఫోన్ చేసి ఎవరికైనా చెబుతామంటే అంత సమయమూ లేదు. అంతే అప్పటికప్పుడు వచ్చిన ఒక ఆలోచనతో ఎర్రటి వస్త్రాన్ని (red cloth) తీసుకొచ్చి రైలు పట్టాలపైన నిలబడింది. దూరం నుంచి గమనించిన రైలు డ్రైవర్.. వేగాన్ని వెంటనే నియంత్రించాడు. ట్రైన్ నెమ్మదించి (stopped train) సమీపంలోకి రాగానే రైలు ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం నుంచీ గట్టెక్కడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.. లేదంటే ఘోర ప్రమాదమే జరిగేది. ఆ సంఘటన కర్ణాటకలోని మంగళూరు–పడీల్‌ జోకెట్ట మధ్యలో చోటుచేసుకుంది. అనంతరం స్థానికులు, రైల్వే సిబ్బంది పట్టాలపై పడిన చెట్టును పక్కకు తొలగించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు చంద్రావతిని అభినందించారు.

TRIAN.jpg

ఇది కూడా చదవండి: Restaurant Banned Smartphone: ఆ రెస్టారెంట్‌లో స్మార్ట్‌ఫోన్లు బ్యాన్.. తినాలంటే ఫోన్‌ను పక్కన పెట్టేయాల్సిందే.. ఈ వింత రూల్ వెనుక..!

మధ్యాహ్నం సమయంలో భోజనం చేసి ఇంటి బయట కూర్చున్నట్లు చంద్రావతి తెలిపింది. అదే సమయంలో ఉన్నట్టుండి ఇంటి ఎదురుగా ఉన్న ఓ పెద్ద చెట్టు పట్టాలపైన విరిగిపడిందనీ.. ఇక అదే సమయంలో మంగళూరు నుంచి ముంబైకి వెళ్లే మత్స్యగంధ రైలు వెళ్తుందన్న విషయం గుర్తుకొచ్చిందని చెప్పింది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియలేదని.. ఎవరికైనా చెబుతామని ఇంట్లోకి వెళ్లానని.. కానీ అంతలోనే రైలు హారన్ వినిపించిందని చెప్పుకొచ్చింది. వెంటనే ఇంట్లో ఉన్న ఎరుపు రంగం వస్త్రం తీసుకుని పట్టాలపైకి పరుగులు తీశానని వివరించింది. తనకు గుండె ఆపరేషన్ జరిగిందని.. అయినా ఈ విషయాన్ని లెక్కచేయలేదని పేర్కొంది. తన చేతిలో ఉన్న ఎరుపు వస్త్రాన్ని చూసి రైలు నెమ్మదించి ఆగిపోయిందని... అలా సుమారు అర గంట సేపు పట్టాలపైనే ఆగిందని తెలిపింది. స్థానికుల సహకారంతో ఆ చెట్టును తొలగించారని వెల్లడించింది. చంద్రావతి చేసిన సాహన్ని నెటిజన్లు, ప్రజలు అభినందించారు.

ఇది కూడా చదవండి: Wedding Gift: హోం థియేటర్ పేలి వరుడు చనిపోయిన కేసులో షాకింగ్ ట్విస్ట్.. పెళ్లిలో ఆ బహుమతిని ఎవరు ఇచ్చారా అని ఆరా తీస్తే..

ఇది కూడా చదవండి: Viral Video: అన్నీ రూ.500 నోట్ల కట్టలే.. దండగా కట్టుకుని మెడలో వేసుకుని.. విసిరేస్తున్నాడు.. ఎందుకిలా చేశాడంటే..!

ఇది కూడా చదవండి: Aadhaar Card New Rules: ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై వీటిల్లో ఏ ఒక్కటి చేయాలన్నా..!

ఇది కూడా చదవండి: Blind Acting: అమ్మబాబోయ్.. స్టార్ హీరోయిన్లు కూడా ఈమె ముందు దిగదుడుపే.. ఏకంగా 15 ఏళ్ల పాటు అంధురాలిగా ఎందుకు నటించిందంటే..

ఇది కూడా చదవండి: Viral Video: ఈ అమ్మాయిలేంటి..? కాలేజీకి పప్పు కుక్కర్లు, చెత్త డబ్బాలు, బకెట్లను తీసుకొచ్చారేంటని అవాక్కవుతున్నారా..? అసలు కథేంటంటే.

Updated Date - 2023-04-05T17:20:27+05:30 IST