AC helmet: ఏసీ హెల్మెట్‌ వచ్చేసిందోచ్.. తయారీదారులు మనవాళ్లే..

ABN , First Publish Date - 2023-05-28T09:16:52+05:30 IST

కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలనే నిబంధన ఇటీవల అమల్లోకి వచ్చింది. హెల్మెట్‌ ధరించకపో

AC helmet: ఏసీ హెల్మెట్‌ వచ్చేసిందోచ్.. తయారీదారులు మనవాళ్లే..

పుదుచ్చేరి, (ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలనే నిబంధన ఇటీవల అమల్లోకి వచ్చింది. హెల్మెట్‌ ధరించకపోవడంతో హెచ్చరించిన పోలీసులు, ప్రస్తుతం ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. దీంతో, పుదుచ్చేరిలో హెల్మెట్‌ ధరించే ద్విచక్రవాహనదారుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో, వాహనదారులు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేలా తెలంగాణ(Telangana)కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో ఏసీ హెల్మెట్‌(AC helmet) తయారు చేసింది. శనివారం జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నమశ్శివాయం దాన్ని పరిశీలించారు. ఈ ఏసీ హెల్మెట్‌ విక్రయాలు త్వరలో ప్రారంభిస్తామని సంస్థ నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2023-05-28T09:16:52+05:30 IST