Accident Video: కుక్కను కాపాడాలని బ్రేక్ వేసింది కానీ.. మరుక్షణంలోనే షాకింగ్ సీన్.. కారుపై ఏదో పడ్డట్టు అనిపించి బయటకు వచ్చి చూస్తే..!
ABN , First Publish Date - 2023-09-05T16:21:03+05:30 IST
ప్రతిమనిషిలోనూ మానవత్వం ఉంటుంది. మూగజీవాల పట్ల, ఇతరుల పట్ల దయతో ప్రవర్తించడం మనిషిలో మానవత్వానికి ఒక ఉదాహరణ. రహదారుల మీద వెళుతున్నప్పుడు వికలాంగులు, జంతువులు, పెద్దవారు కారుకు అడ్డు వస్తే వాటికి దారి వదిలి తమ మంచి మనసు నిరూపించుకుంటారు కొందరు. ఓ మహిళ కూడా అదే పని చేసింది కానీ..
ప్రతిమనిషిలోనూ మానవత్వం ఉంటుంది. మూగజీవాల పట్ల, ఇతరుల పట్ల దయతో ప్రవర్తించడం మనిషిలో మానవత్వానికి ఒక ఉదాహరణ. రహదారుల మీద వెళుతున్నప్పుడు వికలాంగులు, జంతువులు, పెద్దవారు కారుకు అడ్డు వస్తే వాటికి దారి వదిలి తమ మంచి మనసు నిరూపించుకుంటారు కొందరు. ఓ మహిళ కూడా తను రహదారి మీద కారులో వెళ్తోంటే కుక్క అడ్డు వచ్చింది. దాన్ని కాపాడే ఉద్దేశ్యంతో ఆమె కారుకు బ్రేక్ వేసింది. అయితే ఆమె చేసిన ఈ పని వల్ల అక్కడ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
'మంచి చేయబోతే చెడు ఎదురైనట్టు' అనే మాట చాలా సందర్భాలలో వినే ఉంటారు. ఓ మహిళకు(woman) అలాంటి అనుభవం ఎదురైంది. మహిళ రహదారి మీద కారులో వెళ్తోంది. ఆమె వెళ్తున్న దారికి అడ్డుగా ఓ కుక్క(DOG) కనబడింది. అది ముందుకు వెళ్లాలా వద్దా అని అటూ ఇటూ తచ్చాడుతూ కనిపించింది. ఆమె వేగంగా వెళితే కుక్కను గుద్దడం ఖాయం అనిపించి దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కారు సడెన్ బ్రేక్ వేసింది. అమె అలా బ్రేక్ వెయ్యగానే ఆ కుక్క కాస్త అయోమయం నుండి తేరుకుని ముందుకు నడిచింది. అయితే ఆ కారు వెనుకే చాలా స్పీడ్ గా ఓ వ్యక్తి మోటార్ సైకిల్(motor cycle) మీద వస్తున్నాడు. అతను మహిళ కారు బ్రేక్ వేసిందనే విషయం గమనించలేదు. కారు ముందుకెళ్లిపోతుందనే ఉద్దేశంతో బైక్ స్పీడ్ తగ్గించకుండా వేగంగా ముందుకు వచ్చాడు. కానీ అతని దురదృష్టం కొద్దీ నిలబడి ఉన్న కారును వేగంగా ఢీ కొట్టాడు. దీంతో ఆ బైక్ పల్టీ కొట్టింది(bike flip to car) . బైక్ మీద ఉన్న వ్యక్తి ఎగిరి కారుమీద పడ్డాడు. అతను నేరుగా కారు ముందు ఉన్న అద్దం మీద పడటంతో అద్దం విరిగిపోయింది కూడా. ఏమయ్యిందో అర్థం కాక కారులో ఉన్న మహిళ కిందకు దిగి చూసి షాకైపోయింది. కారు మీద పడిన వ్యక్తి కూడా 'నా కర్మ, నా టైం బాగోలేదు' అన్న ఫీలింగ్ లో మెల్లిగా కారు మీద నుండి దిగాడు. గమనిస్తే అతనికి బయటి గాయాలు ఏవీ కాలేదు, మహిళ కూడా ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదానికి గురికాలేదు. రహదారి దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఈ సంఘటన రికార్డవ్వడంతో విషయం బయటకొచ్చింది.
Viral Video: ఈ పిల్లాడు త్వరలోనే ఓవర్ నైట్ సెలబ్రెటీ అయిపోవడం ఖాయం.. నాలుకతోనే ఈ బండి సౌండ్‌ను దించేశాడుగా..!
ఈ వీడియోను elambar_ostani అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ సంఘటన గురించి తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 'ఇది పూర్తీగా ఆ మోటార్ సైకిల్ వ్యక్తి తప్పు. ముందు వెళుతున్న కారు వేగాన్ని గమనించుకోకుండా అతను అలా వేగంగా రావడం తప్పు' అని ఒకరు కామెంట్ చేశారు. 'అతను పెటుకున్న హెల్మెట్ అతని ప్రాణాలు కాపాడింది. ఇందుకే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అందరూ అనేది' అని మరొకరు కామెంట్ చేశారు. 'బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు' అని మరికొందరు అంటున్నారు.