Viral Video: సినీ నటుడిని బలవంతంగా ముద్దాడబోయిన మహిళా అభిమాని...ఆపై ఏం జరిగిందంటే...

ABN , First Publish Date - 2023-02-17T08:45:38+05:30 IST

ఓ సినీనటుడిని మహిళా అభిమాని బలవంతంగా ముద్దాడబోయిన ఉదంతం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది....

Viral Video: సినీ నటుడిని బలవంతంగా ముద్దాడబోయిన మహిళా అభిమాని...ఆపై ఏం జరిగిందంటే...
Female Fan Tries to Forcefully Kiss

ముంబయి: ఓ సినీనటుడిని మహిళా అభిమాని బలవంతంగా ముద్దాడబోయిన ఉదంతం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.(Viral Video) బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్( Actor Aditya Roy Kapur) తాజాగా తన రాబోయే సిరీస్ ది నైట్ మేనేజర్ ముంబై స్క్రీనింగ్‌లో ఒక మహిళా అభిమాని బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించారు.(Female Fan Tries to Forcefully Kiss)దీంతో ఆదిత్య రాయ్ కపూర్ అసౌకర్యానికి గురయ్యాడు.

స్టార్ ఆదిత్యరాయ్ కపూర్ ఆనందంగా ఫొటోల కోసం పోజులిస్తుండగా ఒక మహిళా అభిమాని బలవంతంగా అతన్ని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించింది.చుట్టూ చేతులు వేయడంతో స్టార్‌కి అసౌకర్యంగా అనిపించింది. ఆదిత్య రాయ్ కపూర్ నవ్వుతూ, మెడ చుట్టూ ఉన్న మహిళ చేతిని తీసివేశాడు.దీంతో మహిళా అభిమాని నటుడి చేతిని ముద్దాడింది.

ఇది కూడా చదవండి : Earthquake: సిరియా దేశంలో మళ్లీ భూకంపం...తీవ్రత ఎంతంటే...

సందీప్ మోదీ నేతృత్వంలో రాబోయే సిరీస్‌లో ఆదిత్య రాయ్ కపూర్, శోభితా ధూళిపాలా, తిలోతమా షోమ్, శాశ్వత ఛటర్జీ, రవి బెహ్ల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆదిత్య రాయ్ కపూర్ నటించిన సిరీస్ శుక్రవారం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో(Disney+ Hotstar) ప్రత్యేకంగా ప్రసారం చేశారు.

Updated Date - 2023-02-17T09:00:24+05:30 IST