Viral Video: మీ అన్ననే స్కూల్‌లో చేర్పిస్తా.. నీకు చదువు అక్కర్లేదన్న తండ్రి.. ఈ అఫ్గాన్ బాలిక సమాధానం వింటే..!

ABN , First Publish Date - 2023-07-14T17:51:22+05:30 IST

తాలిబన్లు ఆక్రమించుకున్నాక అఫ్గానిస్థాన్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. అఫ్గాన్ పౌరులపై ఎన్నో కఠిన ఆంక్షలు విధించి వారిని నియంత్రణలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది ఆడ పిల్లలను చదువుకు దూరం చేయడం. బాలికలు పాఠశాలలకు వెళ్లకుండా తాలిబన్లు నిషేధం విధించారు.

Viral Video: మీ అన్ననే స్కూల్‌లో చేర్పిస్తా.. నీకు చదువు అక్కర్లేదన్న తండ్రి.. ఈ అఫ్గాన్ బాలిక సమాధానం వింటే..!

తాలిబన్లు (Talibans) ఆక్రమించుకున్నాక అఫ్గానిస్థాన్ (Afghanistan) పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. అఫ్గాన్ పౌరులపై ఎన్నో కఠిన ఆంక్షలు విధించి వారిని నియంత్రణలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది ఆడ పిల్లలను (Afghan girls) చదువుకు దూరం చేయడం. బాలికలు పాఠశాలల (Schools)కు వెళ్లకుండా తాలిబన్లు నిషేధం విధించారు. తాజాగా అక్కడ పరిస్థితికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియోలో ఓ బాలిక తన తండ్రితో మాట్లాడిన మాటలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.

theafghan అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఆ వీడియోలో అఫ్గాన్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి తన కూతురితో స్కూల్ గురించి మాట్లాడుతున్నాడు. స్కూలు కేవలం మగ పిల్లలకు మాత్రమేనని, ఆడ పిల్లలకు కాదని చెబుతున్నాడు. అందుకు ఆ బాలిక స్పందిస్తూ.. ``కాదు.. స్కూలు ఆడ పిల్లల కోసమే. మగవారికి విధ్వంసం, యుద్ధం చేయడంలోనే ఆసక్తి ఎక్కువ`` అని పేర్కొంది. దానికి ఆ బాలిక తండ్రి.. ``మేం ఏం విధ్వంసం చేశాం`` అని అడిగాడు. తండ్రి ప్రశ్నకు ఆ బాలిక స్పందిస్తూ.. ``కాబూల్ నుంచి కాందహార్ వరకు వెళ్లి చూడు. మగవారు ఎంతో విధ్వంసం సృష్టించారో అర్థం అవుతుంది`` అని చెప్పింది.

Viral Video: ఇంత చిన్న షూలో.. అంత పెద్ద పాము ఎలా దూరిందబ్బా..? ఆమె బయటకు ఎలా తీసిందో మీరే చూడండి..!

స్కూలుకు వెళ్లి నువ్వు ఏం చేస్తావు అని అడిగితే.. తాను స్కూలుకి వెళ్లి చదువుకుంటానని, డాక్టర్, ఇంజనీర్ లేదా టీచర్ అవుతానని, మహిళలందరం కలిసి దేశాన్ని పునర్మిస్తామని చెప్పింది. ఆ వీడియోలో బాలిక సాధికారికంగా మాట్లాడిన తీరు ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఆ వీడియోను ఇప్పటివరకు 15 వేల మంది లైక్ చేశారు. ఏడాది కాలంగా అఫ్గాన్‌లోని మహిళల పరిస్థితి క్రమంగా దిగజారుతోంది. వారిని స్కూళ్లకు, యూనివర్సీటీలకు వెళ్లకుండా తాలిబన్లు నిషేధించారు.

Updated Date - 2023-07-14T17:51:22+05:30 IST