Wife: ఏ మహిళకూ రాకూడని కష్టం.. ఇంటికి వస్తానని ఫోన్ చేసిన భర్త మిస్సింగ్.. 15 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్తే..!
ABN , First Publish Date - 2023-09-14T16:29:11+05:30 IST
సమస్యల పరిష్కారం కోసం కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అయితే కొన్నిసార్లు ఎన్నిసార్లు పోలీసుల చుట్టూ తిరిగినా సమస్య మాత్రం పరిష్కారం కాదు. ఇంకొన్నిసార్లు సమస్య పరిష్కారం కాకపోగా.. మరిన్ని కొత్త సమస్యలు తలెత్తుతుంటాయి. తాజాగా...
సమస్యల పరిష్కారం కోసం కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అయితే కొన్నిసార్లు ఎన్నిసార్లు పోలీసుల చుట్టూ తిరిగినా సమస్య మాత్రం పరిష్కారం కాదు. ఇంకొన్నిసార్లు సమస్య పరిష్కారం కాకపోగా.. మరిన్ని కొత్త సమస్యలు తలెత్తుతుంటాయి. తాజాగా, ఓ మహిళకు.. ఎవరికీ రాకూడని కష్టం వచ్చింది. ఇంటికి వస్తానని చెప్పిన భర్త కనపడకుండాపోయాడు. 15 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్తే చివరికి ఏం జరిగిందంటే..
ఒడిశా (Odisha) జగత్‌సింగ్‌పూర్ ప్రాంతానికి చెందిన 36ఏళ్ల జ్యోతిరంజన్ మొహంతి అనే వ్యక్తి.. పశ్చిమబెంగాల్‌లోని (West Bengal) ఖర్గాపూర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో కాంట్రాక్ట్ వర్కర్‌గా పని చేస్తున్నాడు. ఇతడి భార్య మనోరమా మొహంతి.. వారి స్వగ్రామంలో ఉంటోంది. అప్పుడప్పుడూ సొంతూరుకు వెళ్లి.. కుటుబ సభ్యులను చూసి వస్తుండేవాడు. ఈ క్రమంలో అనారోగ్యంగా ఉండడంతో ఆగస్టు 29న సాయంత్రం ఇంటికి వస్తున్నట్లు భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. అయితే రాత్రవుతున్నా అతను మాత్రం ఊరికి వెళ్లలేదు. దీంతో జ్యోతిరంజన్ భార్య కంగారుపడింది. మరుసటి రోజు కూడా ఇంటికి రాకపోవడంతో కంగారుపడి.. అతను పని చేస్తున్న కంపెనీ వద్దకు వెళ్లి విచారించారు.
అంతుకు ముందే రోజే సెలవు పెట్టి ఇంటికి వెళ్లాడని కంపెనీలో చెప్పడంతో ఆమె మరింత ఆందోళనకు గురైంది. 15రోజుల తర్వాత తన భర్త మిస్సింగ్‌పై (Husband missing) పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే కేసు దర్యాప్తు విషయంలో పోలీసులు పట్టించుకోలేదు. ఎక్కడ తప్పిపోయాడో అక్కడే ఫిర్యాదు చేయాలంటూ పంపించేశారు. దీంతో ఏం చేయాలో తెలీక.. చివరికి ఆమె సోషల్ మీడియా ద్వారా తన సమస్యను వివరించింది. తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ ఘటనపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక సంఘమిత్ర తెలిపారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.