భర్త శరీరంలో కూడా గర్భాశయం.. పెళ్లయి 5 ఏళ్లయినా పిల్లలు పుట్టడం లేదని భార్యతో సహా ఆస్పత్రికెళ్తే డాక్టర్లు బయటపెట్టిన నిజాలివి..!

ABN , First Publish Date - 2023-02-25T19:27:06+05:30 IST

అంతా సవ్యంగా సాగుతోంది. ఏ ఇబ్బందీ లేదనుకుంటున్న సమయంలో ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంటుంది. ఫలితంగా ఆనందకరమైన జీవితాల్లో ఒక్కసారిగా అల్లకల్లోలం మొదలవుతుంది. ఇక దంపతుల విషయంలో ఇలాంటి ఉహించని సమస్యలు వచ్చిపడితే..

భర్త శరీరంలో కూడా గర్భాశయం.. పెళ్లయి 5 ఏళ్లయినా పిల్లలు పుట్టడం లేదని భార్యతో సహా ఆస్పత్రికెళ్తే డాక్టర్లు బయటపెట్టిన నిజాలివి..!

అంతా సవ్యంగా సాగుతోంది. ఏ ఇబ్బందీ లేదనుకుంటున్న సమయంలో ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంటుంది. ఫలితంగా ఆనందకరమైన జీవితాల్లో ఒక్కసారిగా అల్లకల్లోలం మొదలవుతుంది. ఇక దంపతుల విషయంలో ఇలాంటి ఉహించని సమస్యలు వచ్చిపడితే.. వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐదేళ్లయినా పిల్లలు లేకపోవడంతో వైద్యుల వద్దకు వెళ్లిన దంపతులు.. చివరకు వారు చెప్పింది విని షాక్ అయ్యారు. భర్త శరీరంలో గర్భాశయం ఉందని చెప్పిన వైద్యులు.. చివరకు ఏం చేశారంటే..

న్యూఢిల్లీ (New Delhi) పరిధిలోని ఫరీదాబాద్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల ఓ వ్యక్తికి స్థానిక ప్రాంతానికి చెందిన యువతితో (marrying a young woman) వివాహమైంది. వీరికి ఆర్థిక సమస్యలూ లేవు, అలాగని ఎలాంటి గొడవలూ లేవు. సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో ఎవరూ ఊహించని సమస్య వచ్చి పడింది. సాధారణంగా వివాహమైన తర్వాత ఏ దంపతులైనా పిల్లలు (children) కావాలని కోరుకుంటారు. అలాగే వీరికీ ఎంతో ఆశ ఉండేది. అయితే ఏళ్లు గడుస్తున్నా సంతానం మత్రం కలగలేదు. లేటుగా అయినా సంతానం అందుతుందిలే అని సరిపెట్టుకున్నారు.

Viral Video: ఎవరీ కుర్రాడు.. వెంటనే కాంటాక్ట్ నెంబర్ పంపండంటూ సెలబ్రెటీల ట్వీట్లు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..!

అయితే ఐదేళ్లు గడుస్తున్నా సంతానం కలగకపోవడంతో ఆందోళన (worry) మొదలైంది. చివరకు ఇరుగుపొరుగు వారి సలహాతో వైద్యులను సంప్రదించారు. పరీక్షించిన వైద్యులు చివరకు షాక్ అయ్యారు. భర్త శరీరంలో కూడా గర్భాశయం, అండాశయం (uterus, ovary), ఫెలోపియన్ నాళాలు వంటి స్త్రీ అవయాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ వార్త వినగానే ఆ దంపతులు షాక్ అయ్యారు. చివరకు యువకుడి శరీరంలోని అవయవాలను రోబోటిక్ ఆపరేషన్ (Robotic operation) ద్వారా తొలగించారు. అయితే అతను సాధారణంగా తండ్రి అయ్యే అవకాశం ఉండదని, టెస్ట్ ట్యూబ్ బేబీ (Test tube baby) సాయంతో ఆ అవకాశం ఉంటుందని వివరించారు.

OYO Rooms: అమ్మ బాబోయ్.. ఓయో రూమ్స్‌ను ఇలాంటి పనులకు కూడా వాడుతున్నారా..? పోలీసుల రైడింగ్‌తో వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!

అయితే లైంగిక పరంగా మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్యులు వివరించారు. ప్రపంచంలో చాలా అరుదుగా ఇలాంటి పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ (PMDS) కేసులు వెలుగులోకి వస్తుంటాయని చెప్పారు. మిలియన్ల మందిలో ఒకరికి మాత్రమే ఇలాంటి అవయవాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 300 కంటే తక్కువ కేసులు మత్రమే నమోదైనట్లు వివరించారు. ఈ కేసుల్లో నిర్లక్ష్యం వహిస్తే చివరకు రోగికి కేన్సర్ (Cancer) సోకే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పెళ్లి తర్వాత ఇలాగే జరగాలంటూ వధువు వింత కోరిక.. వరుడి తండ్రి కూడా ఒప్పుకోవడంతో.. చివరకు అంతా కలిసి..

Updated Date - 2023-02-25T19:27:12+05:30 IST