ఏరి కోరి పెళ్లి చేసుకున్న భార్య.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తెలిస్తే.. పెళ్లయిన 6 నెలల తర్వాత ఆ భర్తకు మైండ్‌బ్లాంక్.. చివరకు..

ABN , First Publish Date - 2023-02-15T19:30:37+05:30 IST

పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న ఓ వ్యక్తికి మ్యాట్రిమోనియల్ యాప్‌లో ఓ మహిళ పరిచయమైంది. భర్తకు విడాకులు ఇచ్చి ఒంటిరిగా ఉన్నానని చెప్పడంతో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. చివరికీ ఇద్దరూ కలిసి వివాహం కూడా చేసుకున్నారు. ఆనందంగా..

ఏరి కోరి పెళ్లి చేసుకున్న భార్య.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తెలిస్తే.. పెళ్లయిన 6 నెలల తర్వాత ఆ భర్తకు మైండ్‌బ్లాంక్.. చివరకు..

పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న ఓ వ్యక్తికి మ్యాట్రిమోనియల్ యాప్‌లో ఓ మహిళ పరిచయమైంది. భర్తకు విడాకులు ఇచ్చి ఒంటిరిగా ఉన్నానని చెప్పడంతో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. చివరికీ ఇద్దరూ కలిసి వివాహం కూడా చేసుకున్నారు. ఆనందంగా సాగుతున్న వారి వైవాహిక జీవితంలో ఆరు నెలల తర్వాత అనుకోని ఘటన చోటు చేసుకుంది. భార్య మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తెలిసి భర్త షాక్ అయ్యాడు. చివరకు ఏం జరిగిందంటే..

గుజరాత్ (Gujarat) అహ్మదాబాద్ పరిధికి చెందిన ఓ యువకుడు (young man) ఇటీవల పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో పలు మ్యాట్రిమోనియల్ యాప్‌లలో (Matrimonial app) అమ్మాయిల కోసం వెతికేవాడు. ఈ క్రమంలో అస్సాంలోని గౌహతికి చెందిన మహిళ (woman) తన పేరు రీటా దాస్ అనే మహిళ పరిచయమైంది. తనకు చిన్న వయసులో వివాహమైందని, ప్రస్తుతం భర్తకు విడాకులు ఇచ్చి ఒక్కదాన్నే ఉంటున్నానని యువకుడికి చెప్పింది. ఆమె మాటలు నమ్మిన అతను రోజూ మాట్లాడుతూ ఉండేవాడు.

ఓ ఇంట్లోంచి తీవ్ర దుర్వాసన.. తలుపులు పగలగొట్టి ఇల్లంతా వెతికినా వీడని మిస్టరీ.. బెడ్రూంలోని పరుపులో కనిపించిన సీన్ చూసి..!

women-crime.jpg

ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొన్ని నెలల క్రితం ఆమెను అహ్మదాబాద్‌లో వివాహం (marriage) చేసుకున్నాడు. వివాహానంతరం ఇద్దరూ ఆనందంగా ఉండేవారు. వివాహమైన ఆరు నెలల తర్వాత.. ఇటీవల ఓ రోజు రీటా.. తన భూమికి సంబంధించిన కేసు నిమిత్తం గౌహతి వెళ్లింది. నాలుగు రోజులవుతున్నా రాకపోవడంతో భర్త ఆమెకు ఫోన్ చేశాడు. ఓ రోజు న్యాయవాది ఫోన్ లిఫ్ట్ చేసి, ‘‘మీ భార్య ఓ కేసులో జైల్లో ఉందని, బెయిల్ కోసం రూ.1లక్ష కావాలని అడిగాడు. దీంతో అతడు అడిగిన మొత్తాన్ని భర్త పంపించాడు. అయితే న్యాయవాది పంపించిన తన భార్యకు సంబంధించిన కోర్టు పత్రాల్లో రీటా దాస్ అని కాకుండా రీటా చౌహాన్ అని ఉండడంతో అతడికి అనుమానం వచ్చింది.

Valentines Day: పార్కులో కూర్చున్న భార్యాభర్తలు.. ప్రేమికులేమోనని భావించిన భజరంగ్‌ దళ్ కార్యకర్తలు.. చివరకు ఊహించని సీన్..!

ఇదే విషయం మాట్లాడాలని ఫోన్ చేస్తే.. అవతలి వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. చివరకు రీటా చౌహాన్ పేరుతో గూగుల్‌లో (Google) వెతగ్గా.. ఆమె గతంలో 5000 కార్ల చోరీతో (Car theft) పాటూ ఖడ్గమృగాల వేట, ఆయుధాల స్మగ్లింగ్ తదితర పెద్ద పెద్ద కేసుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తెలిసింది. ఈ కేసుల్లో రీటా మొదటి భర్త అనిల్‌ను ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం బయటపడింది. మోసపోయానని తెలుసుకున్న రెండో భర్త.. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

రైల్లోంచి ప్రయాణీకులంతా దిగినా ఎవరూ తీసుకెళ్లని ట్రంకు పెట్టె.. కిందకు దించి తాళాలు పగలగొడితే లోపల కనిపించిన దృశ్యం చూసి..!

Updated Date - 2023-02-15T19:30:40+05:30 IST