పెళ్లి వేడుకలో వరుడిని చూడగానే మారిపోయిన వధువు మనసు.. నచ్చలేదంటూ తేల్చిచెప్పడంతో షాకింగ్ ట్విస్ట్.. పెళ్లి జరిగింది కానీ..
ABN , First Publish Date - 2023-02-21T17:15:28+05:30 IST
సినిమా పెళ్లిళ్లలో ఎలాగైతే ట్విస్టులు, షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయో.. అప్పుడప్పుడూ నిజ జీవితంలోనూ ఇలాగే జరుగుతుంటుంది. వింత వింత కారణాలతో చివరి నిముషంలో వివాహాలు క్యాన్సిల్ అవుతుంటాయి. అదేవిధంగా...
సినిమా పెళ్లిళ్లలో ఎలాగైతే ట్విస్టులు, షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయో.. అప్పుడప్పుడూ నిజ జీవితంలోనూ ఇలాగే జరుగుతుంటుంది. వింత వింత కారణాలతో చివరి నిముషంలో వివాహాలు క్యాన్సిల్ అవుతుంటాయి. అదేవిధంగా అప్పటిదాకా అతిథులుగా ఉన్న వారు.. అనూహ్యంగా వధూవరులుగా మారిపోతుంటారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ విచిత్ర వివాహం గురించి సోషల్ మీడియాలో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. పెళ్లి వేడుకలో వరుడిని చూడగానే వధువు మనసు మార్చుకుంది. నచ్చలేదని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. అయితే చివరకు ఆమె వివాహం ఎలా జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఆగ్రా జిల్లా బర్హాన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతికి (young woman).. ఫిరోజాబాద్ పరిధి పచ్‌మన్ షాపూర్ ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం (marriage) నిశ్చయమైంది. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ.. వారం క్రితం ఆ సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. అనంతరం యువతి తల్లిదండ్రులు... ఎలాగైనా తమ కూతురికి త్వరగా పెళ్లి చేయాలనే ఉద్దేశంతో తాజ్‌గంజ్‌కు చెందిన యువకుడితో సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. పెళ్లి ఏర్పాట్లను కూడా ఘనంగా నిర్వహించారు. అతిథులంతా వివాహ వేడుకకు తరలివచ్చారు. ఇంతలో వరుడు గుర్రం మీద గ్రామానికి చేరుకున్నాడు.
అనంతరం జయమాల కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అయితే వరుడిని చూడగానే వధువు ఒక్కసారిగా మనసు మార్చుకుంది. ‘‘నాకు ఇతను నచ్చలేదు.. నీకీ పెళ్లి వద్దనే వద్దు’’.. అంటూ భీష్మించుకుంది. సడన్‌గా వధువు (bride) తీసుకున్న నిర్ణయంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. నచ్చజెప్పి ఎలాగోలా పెళ్లి చేయాలని అంతా ఎంతో ప్రయత్నించారు. అయినా యువతి మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు. వాగ్వాదం అనంతరం చేసేదేమీలేక వరుడు నిరాశతో తిరిగి వారి గ్రామానికి వెళ్లిపోయాడు.
అయితే పెళ్లి ఆగిపోకూడదనే ఉద్దేశంతో గతంలో రద్దు చేసుకున్న సంబంధాన్నే ఖాయం చేసుకోవాలని భావించారు. చివరకు సదరు యువకుడికి ఇదే విషయం చెప్పడంతో వారు కూడా అంగీకరించారు. అనుకోకుండా వరుడిగా మారిన యువకుడు.. ఊరేగింపుతో వధువు గ్రామానికి చేరుకున్నాడు. దీంతో అదే ముహూర్థానికి వివాహ కార్యక్రమం ఘనంగా జరిగింది. సినిమా తరహాలో జరిగిన ఈ వివాహం.. స్థానికంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ (Wedding viral news) హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.