Hostel Boys: హాస్టల్ యజమాని కనుక ఈ కుర్రాళ్ల నిర్వాకం చూస్తే గగ్గోలు పెట్టడం ఖాయం.. ఐపీఎల్ మ్యాచ్ అయిపోయిందో లేదో.. వెంటనే..

ABN , First Publish Date - 2023-06-01T13:45:19+05:30 IST

ఈసారి ఐపీఎల్ ఫైనల్ (Final of IPL 2023) మ్యాచ్ ఎంత రంజుగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Hostel Boys: హాస్టల్ యజమాని కనుక ఈ కుర్రాళ్ల నిర్వాకం చూస్తే గగ్గోలు పెట్టడం ఖాయం.. ఐపీఎల్ మ్యాచ్ అయిపోయిందో లేదో.. వెంటనే..

Hostel Boys: ఈసారి ఐపీఎల్ ఫైనల్ (Final of IPL 2023) మ్యాచ్ ఎంత రంజుగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరి బాల్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్.. క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. చివరి రెండు బంతులకు చెన్నై విజయానికి 10 పరుగులు కావాల్సిన తరుణంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శనతో ఆకట్టకున్నాడు. రెండు బంతుల్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి.. చెన్నై సూపర్ కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చడంతో పాటు ఒంటిచెత్తో ఐదో ట్రోఫీని అందించాడు. ఇక తమ అభిమాన జట్టు విజయం చూసి చెన్నై ఫ్యాన్స్ చేసిన హంగామా అంతఇంత కాదు. వారి సెలబ్రేషన్స్ తాలూకు పలు వీడియోలో ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యాయి కూడా. అయితే, అలాంటి వీడియోల్లో హాస్టల్ బాయ్స్‌ క్రేజీ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి మాత్రం ఇంకా బాగా వైరల్ అయింది.

'ఇదేందయ్యా ఇది.. ఇంతకుముందెన్నడూ చూడలేదు అన్నట్టుగా' మనోళ్లు చెన్నై విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు మరి. హాస్టల్‌లో ల్యాప్‌ట్యాప్‌లో మ్యాచ్ వీక్షించిన బాయ్స్.. సీఎస్‌కే (CSK) ఆఖరి బంతికి విజయం సాధించడంతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. అందులో ఓ అబ్బాయి అయితే తన ఎమోషన్ ఆపులేక కప్‌బోర్డ్ డోర్స్‌ను పలుమార్లు బలంగా తన్నడం చూడొచ్చు. అంతటితో ఆగకుండా డోర్లను చేతులతో పట్టుకుని గట్టిగా లాగడం, వాటిపై ఎక్కడం లాంటివి చేశాడు. అంతే.. ఈ హాస్టల్ బాయ్స్ విక్టరీ సెలబ్రేషన్స్ తాలూకు వీడియో బయటకు రావడం.. అది కాస్త వైరల్ కావడం జరిగింది (Video goes Viral). "అమ్మాయిలు: అబ్బాయిలకు అసలు ఎమోషన్స్ ఉండవు. వాళ్లు పక్కా ఎమోషన్‌లేస్. అప్పుడు అబ్బాయిలు:..." అనే లైన్స్‌తో ఓ ట్విటర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పటివరకు వీడియోను 8లక్షలకు పైగా మంది వీక్షించారు. ఇక వీడియో చూసిన నెటిజన్లు దీనిపై ఫన్నీగా స్పందిస్తున్నారు.

Viral Video: ఈ ఆటోడ్రైవర్ తెలివి ముందు ఇంజనీర్లు కూడా సరిపోరుగా.. ఎండలు మండిపోతున్నాయని ప్రయాణీకుల కోసం..!

Updated Date - 2023-06-01T13:45:19+05:30 IST