Elephant: ఈ ఏనుగుకు ఏకంగా రూ.5 కోట్ల ఆస్తి.. దీని కోసం ఒకరిని చంపేశారు కూడా.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-03-21T18:10:30+05:30 IST

ఎవరైనా ఆస్తులు రాయాలనుకుంటే పిల్లల పేరునో... లేదంటే వాళ్లు నచ్చలేదంటే ట్రస్టుల పేరునో రాసేస్తారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా తన యావదాస్తి అంతటిని

Elephant: ఈ ఏనుగుకు ఏకంగా రూ.5 కోట్ల ఆస్తి.. దీని కోసం ఒకరిని చంపేశారు కూడా.. అసలేం జరిగిందంటే..
Elephant

ఎవరైనా ఆస్తులు రాయాలనుకుంటే పిల్లల పేరునో... లేదంటే వాళ్లు నచ్చలేదంటే ట్రస్టుల పేరునో రాసేస్తారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా తన యావదాస్తి అంతటిని జంతువుల పేరున రాసేశాడు. ఇది ఆశ్చర్యంగానే అనిపించొచ్చు. కానీ ఇది వాస్తవం. అలా ఎందుకు చేశాడు. ఆస్తిని మనుషులకు కాకుండా జంతువుల పేరునే ఎందుకు రాశాడో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

కుక్కలు విశ్వాసం గల జంతువులు.. వాటిని ఇంటికి కాపాలా పెట్టుకుంటాం. అంతేకాదు.. కొన్ని సార్లు ప్రమాదాల నుంచి కూడా కాపాడిన సందర్భాలు ఉన్నాయి. అంతగా కుక్కలను విశ్వసిస్తుంటారు. అలాగే దుండగుల నుంచి తన ప్రాణాలు కాపాడిన ఏనుగుల పేరున తన ఆస్తి అంతటిని రాసేశాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన బీహార్‌ (Bihar)లో చోటుచేసుకుంది.

బీహార్‌ రాష్ట్రంలోని జాన్‌పుర్‌కు చెందిన మహమ్మద్‌ అక్తర్‌ ఇమామ్‌ (Akhtar Imam) అనే వ్యక్తి రెండు ఏనుగుల పేరు మీద రూ.5 కోట్ల విలువైన ఆస్తిని రాసేశాడు. అయితే ఇటీవల ఓ ఏనుగు అనారోగ్యంతో మరణించింది. దీంతో ‘రాణి’ అనే మరో ఏనుగు యావదాస్తికి ఏకైక వారసురాలి అయింది. అక్తర్‌ రెండు ఏనుగులు పెంచుకునే వాడు. వాటికి మోతి (Moti) , రాణి (Rani) అని పేర్లు పెట్టాడు. ఒకానొక సమయంలో ప్రాణాపాయం నుంచి అక్తర్‌ను కాపాడాయి. దీంతో ఏనుగులను అక్తర్ ఎంతగానో విశ్వసించేవాడు. ఒక వేళ తాను చనిపోయినా వాటి మనుగడకు ఎలాంటి లోటు ఉండకూడదని ఆలోచించి తనకున్న రూ.5 కోట్ల విలువైన ఆస్తిని ఆ రెండు ఏనుగుల పేరు మీద వీలునామా రాశాడు.

ELE.jpg

ఇది కూడా చదవండి: ఈ ఫొటోలోని వ్యక్తి ఒకప్పుడు ఓ సినీ నటి ఇంట్లో పనోడు.. నేడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు..!

ఇదిలా ఉంటే అంతక ముందే అక్తర్ తన భార్య, పిల్లలతో విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నాడు. అతడు తన ఆస్తి అంతటిని ఏనుగులకు రాసివ్వడం భార్య, పిల్లలకు రుచించలేదు. ఈ నేపథ్యంలో అక్తర్ 2021లో హత్యకు గురయ్యాడు. అప్పటికే వీలునామా రాయడంతో ఆస్తి మొత్తం ఏనుగులకే దక్కింది. మోతి అనారోగ్యంతో చనిపోగా.. ప్రస్తుతం రాణి ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో ఓ వ్యక్తి సంరక్షణలో క్షేమంగా ఉంది. ఆస్తి మాత్రం బీహార్‌లోని పాట్నాలో ఉంది. ఆస్తిని రాణికి సద్వినియోగం చేస్తేనే అక్తర్ ఆశయం నెరవేరుతుందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.

two.jpg

Updated Date - 2023-03-21T18:17:10+05:30 IST