Viral News: అరుదైన వ్యాధినే అవకాశంగా మలుచుకుని ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నాడు.. శరీరం మొత్తాన్ని విల్లులా వంచేస్తూ..

ABN , First Publish Date - 2023-04-19T18:00:22+05:30 IST

ఓ యువకుడు శరీరం మొత్తాన్ని విల్లులా వంచేస్తూ అందర్నీ వామ్మో.. అనిపిస్తున్నాడు.

Viral News: అరుదైన వ్యాధినే అవకాశంగా మలుచుకుని ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నాడు.. శరీరం మొత్తాన్ని విల్లులా వంచేస్తూ..
Viral News

మానవదేహం ఒక అద్భుతమైన నిర్మాణం. దీన్నీ ఎవరూ తయారు చేయలేరు.. నిర్మించలేరు. తల్లి గర్భంలో ఒక చిన్న పిండం మనిషిగా మారి భూమ్మీదకు వస్తాడు. ఈ దేహం మాంసంతోనూ.. ఎముకులతోనూ... నరాలతోనూ నిర్మించబడుతుంది. చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేదు. అలాంటిది ఓ యువకుడు శరీరం మొత్తాన్ని విల్లులా వంచేస్తూ అందర్నీ వామ్మో.. అనిపిస్తున్నాడు.

అప్పుడప్పుడూ కిందపడినప్పుడు ఎముకులు విరుగుతుంటాయి. డాక్టర్లు కట్టువేసి నార్మల్ స్థితికి తెచ్చినా.. గాయం ప్రభావం మాత్రం అలానే ఉంటుంది. ఎలా పడితే అలా ఈ దేహాన్ని వంచలేం. అందుకే ఈ దేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం తనకు సోకిన అరుదైన వ్యాధిని ఓ అవకాశంగా మలుచుకున్నాడు. శరీరాన్ని వంపులు తిప్పుతూ ఏకంగా 7 గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు సంపాదించాడు. ఈ సీన్ చూస్తే వామ్మో అనకుండా ఉండలేరు.

dldl.jpg

అమెరికాకు (America) చెందిన డేనియల్‌ బ్రౌనింగ్‌ స్మిత్‌ (Daniel Browning Smith) తన శరీరాన్ని ఎటుపడితే అటు విల్లులా వంచేస్తున్నాడు. శరీరాన్ని మొత్తాన్ని మడత పెట్టేసి ఓ పెట్టెలోకి (body) వెళ్లిపోగలడు. డేనియల్‌ బ్రౌనింగ్‌ స్మిత్‌ ‘ది రబ్బర్‌ బోయ్‌’గా గుర్తింపు పొందాడు. ఇతడు తన శరీరాన్ని ఎటుపడితే అటు విల్లులా వంచగలడు. శరీరం మొత్తాన్ని మడత పెట్టేసుకొని ఓ పెట్టెలోకి వెళ్లిపోగలడు. ఈ గుర్తింపుతో అతడికి పలు ప్రకటనలు, సినిమాలు, టీవీ షోల్లోనూ నటించే అవకాశాలు దక్కాయి. అమెరికాలోని మెరిడియన్‌లో జన్మించిన డేనియల్‌ చిన్నపిల్లాడిగా ఉన్నపుడు బాగా ఎత్తులో నుంచి నేలపై దూకేవాడు. 2007లో డేనియల్‌ ‘మోస్ట్‌ ఫ్లెక్సిబుల్‌ మ్యాన్‌’ అనే గిన్నిస్‌బుక్‌ అవార్డు దక్కించుకున్నాడు. డేనియల్‌ ఖాతాలో అలాంటి రికార్డులు (world record) మొత్తం ఏడు చేరాయి.

plasttoi.jpg

డేనియల్ తన శరీరాన్ని పలురకాలుగా వంచడానికి అసలు కారణం ఏంటంటే ‘ఎలస్‌ డన్లోస్‌ సిండ్రోమ్‌’ అనే జన్యుపరమైన లోపం కారణంగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇందులో 13 రకాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యాధి బారినపడినవారి శరీరంలోని కీళ్లు ఎన్ని వంపులైనా తిరుగుతాయి. ఈ వ్యాధి సోకిన చాలామంది తీవ్రమైన కండరాలు, ఎముకల నొప్పులతో బాధపడుతుంటారు. అదృష్టవశాత్తూ డేనియల్‌కు ఓ మోస్తరు నొప్పి మాత్రమే ఉంటోంది. అందుకే తాను ఎంచుకున్న రంగంలో అవలీలగా రాణించగలుగుతున్నాడని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఈ రోజు మందు ఫ్రీ.. అనే బోర్డును చూసి క్లబ్‌లోకి వెళ్లాడో వ్యక్తి.. చివరకు అతడి శవమే బయటకు వచ్చింది.. అసలేం జరిగిందంటే..!


ఇది కూడా చదవండి: Viral Video: అమ్మ బాబోయ్.. ఇదేం వింత.. గాల్లోకి ఎగురుతున్న పాములు.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..!

ఇది కూడా చదవండి: Viral News: పండ్ల మార్కెట్లో కూలి పనిచేస్తున్న ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టి విస్తుపోయిన పోలీసులు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన..!

Updated Date - 2023-04-19T18:03:48+05:30 IST