Viral Video: సాకులు చెప్పి పని తప్పించుకునే వాళ్లు.. ఈ కుర్రాడి వీడియోను చూస్తే సిగ్గుతో తలదించుకుంటారు..!
ABN , First Publish Date - 2023-07-13T21:52:04+05:30 IST
అవయవాలన్నీ సక్రమంగా ఉండి.. కష్టపడే శక్తి ఉన్నా.. చాలా మంది సోమరిపోతుల్లా తయారవుతుంటారు. కొందరు జల్సాలకు అలవాటు పడి విలువైన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటుంటే.. ఇంకొందరు అన్నీ ఉన్నా.. నిత్యం నిరాశతోనే కాలం వెళ్లదీస్తుంటారు. మరికొందరు ఏవేవో..
అవయవాలన్నీ సక్రమంగా ఉండి.. కష్టపడే శక్తి ఉన్నా.. చాలా మంది సోమరిపోతుల్లా తయారవుతుంటారు. కొందరు జల్సాలకు అలవాటు పడి విలువైన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటుంటే.. ఇంకొందరు అన్నీ ఉన్నా.. నిత్యం నిరాశతోనే కాలం వెళ్లదీస్తుంటారు. మరికొందరు ఏవేవో సాకులు చెబుతూ పనులు తప్పించుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ కుర్రాడి వీడియో చూస్తే.. సిగ్గుతో తల దించుకుంటారు. రెండు కాళ్లూ లేకున్నా పొట్టకూటి కోసం తలపై ఇసుక తట్ట పెట్టుకుని కష్టపడుతున్న యువకుడిని చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. అంగవైకల్యంతో పుట్టిన ఓ యువకుడు (Disabled young man) .. తన జీవితం ఇలా అయిందే అని ఏనాడూ నిరాశ చెందలేదు. కాళ్లు పని చేయకున్నా.. తనకు కష్టపడే శక్తి ఉందని నిరూపించాడు. పొట్టకూటి కోసం తోటి యువకులతో పోటీ పడి మరీ పనిలోకి దిగాడు. అది కూడా ఎత్తైన ప్రదేశంలో జరుగుతున్న పని వద్దకు ఇసుక తట్టను తలపై పెట్టుకుని మెట్లపై వెళ్తున్నాడు. ఓ చేత్తో ఇసుక తట్టను పట్టుకుని, మరో చేత్తో మెట్లను చకాచకా ఎక్కేశాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో ఇసుక తట్టలను మోస్తూ ఉన్నాడు.
అయినా అతడి మొఖంలో ఇసుమంత కూడా అలసట కనిపించలేదు. పైగా మరింత ఉత్సాహంతో చిరు నవ్వుతో పని చేస్తున్న యువకుడిని చూసి అంతా శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. కాగా, ఈ యువకుడి వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘చిన్న సమస్యలకే ఆత్మహత్య నిర్ణయాలు తీసుకునే యువత.. ఇతన్ని చూసి ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘అనుకుంటే కానిది ఏమున్నది’’.. అంటూ మరికొందరు, ‘‘నీ పట్టుదలకు హ్యాట్సాప్ బ్రదర్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైకులను సొంతం చేసుకుంది.
Viral Video: ఎక్కడి నుంచి వస్తాయి తల్లీ ఇలాంటి ఐడియాలు.. టూత్ పేస్ట్ డబ్బాను ఇలా కూడా వాడొచ్చా..!?