Mother: నెటిజన్ల మనసును కట్టిపడేస్తున్న ఫొటో ఇది.. అప్పుడు.. ఇప్పుడు.. అంటూ ఓ మహిళ పెట్టిన ఫొటోను చూసి..!
ABN , First Publish Date - 2023-07-13T15:10:58+05:30 IST
గతించిన జ్ఞాపకాల్లో కొన్ని సందర్భానుసారం గుర్తుకొస్తూ ఆనందాన్ని పంచితే.. మరికొన్ని బాధ పెడుతుంటాయి. ఒకప్పుడైతే గత స్మృతులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు అందుబాటులో ఉండేవి కావు. కానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో గడిచిపోయిన రోజులన్నీ మళ్లీ..
గతించిన జ్ఞాపకాల్లో కొన్ని సందర్భానుసారం గుర్తుకొస్తూ ఆనందాన్ని పంచితే.. మరికొన్ని బాధ పెడుతుంటాయి. ఒకప్పుడైతే గత స్మృతులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు అందుబాటులో ఉండేవి కావు. కానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో గడిచిపోయిన రోజులన్నీ మళ్లీ కళ్ల ముందు కదిలేలా.. ఫొటోలు, వీడియోల రూపంలో భద్రపరచుకునే వెసులుబాటు ఉంది. దీంతో చాలా మంది అప్పుడప్పుడూ జరిగిపోయిన ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూసుకుంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిదంటే.. ఓ మహిళ షేర్ చేసిన ఫొటో చూసి నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. ప్రస్తుతం ఆమె పోస్టు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో ఓ మహిళ పెట్టిన పోస్టు ప్రస్తుతం (Woman viral posts) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ తన తల్లిని (mother) ఎంతో ప్రేమతో చూసుకునేది. ఆమె యోగక్షేమాలను దగ్గరుండి చూసుకునేది. అలాగే ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు (Photos and videos) తీసుకుంటూ తల్లితో సరదాగా గడిపేది. అయితే ఆమె వృద్ధాప్య సమస్యల కారణంగా చనిపోయింది. దీంతో అప్పట్లో తీసుకున్న ఫొటోలు, వీడియోలు.. తల్లి జ్ఞాపకంగా ఉండిపోయాయి. ఇదిలావుండగా.. ఇటీవల సదరు మహిళ ఇంట్లో చపాతీ తింటుండగా... ఉన్నట్టుండి తన తల్లి గుర్తుకొచ్చింది. అప్పట్లో తన తల్లికి వడ్డించిన చపాతీ, కూర ఒకటే కావడంతో వెంటనే టేబుల్‌పై పెట్టి ఫొటో తీసుకుంది.
Viral Video: ఎక్కడి నుంచి వస్తాయి తల్లీ ఇలాంటి ఐడియాలు.. టూత్ పేస్ట్ డబ్బాను ఇలా కూడా వాడొచ్చా..!?
అప్పట్లో తన తల్లి సోఫాలో కూర్చుని భోజనం చేస్తుండగా తీసిన ఫొటోను, ప్రస్తుతం అదే సోఫా ఎదురుగా చపాతీ ప్లేటు (Chapati plate) ఉన్న ఫొటోను కలిపి ట్విట్టర్‍లో షేర్ చేసింది. అదే భోజనం, ‘‘అదే సోఫా.. కానీ అమ్మ మాత్రం ఇప్పుడు లేదు.. ఈ బాధ నుంచి నేను ఎప్పటికీ కోలుకోలేను’’.. అంటూ తన మనసులోని వేదనను వ్యక్తం చేసింది. కాగా, ఈ పోస్టు ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘లైకుల కోసం తల్లి ఫొటోను వాడుకుంది’’.. అని కొందరు విమర్శిస్తే.. ‘‘తల్లిపై మీకున్న ప్రేమ అర్థమవుతోంది’’.. అని మరికొందరు, ‘‘పదే పదే అదే తలుచుకుని బాధపడకండి’’.. అని ఇంకొందరు సలహాలు ఇస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం 4మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.