Anand Mahindra: ఆనంద్ మహీంద్రాకు తెగ నచ్చేసింది కానీ.. అక్కడికి వెళ్లాలంటేనే భయమేస్తోందట.. కారణమేంటంటే..!

ABN , First Publish Date - 2023-07-14T12:45:00+05:30 IST

ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ప్లేస్ ఆయనకు తెగ నచ్చేసిందట. కానీ అక్కడ ఉండాలంటే భయమేస్తోంది అని అంటున్నారు..

Anand Mahindra: ఆనంద్ మహీంద్రాకు తెగ నచ్చేసింది కానీ.. అక్కడికి వెళ్లాలంటేనే భయమేస్తోందట.. కారణమేంటంటే..!

భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని మరొమెట్టు ఎక్కించిన వారిలో ఆనంద్ మహీంద్రా పేరు తప్పనిసరిగా ఉంటుంది. తెలివైనవారు, మంచి మనసున్నవారు, ఎదుటి వ్యక్తి ప్రతిభను నిస్సందేహాం లేకుండా మెచ్చుకుంటారీయన. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ కొత్త విషయాలను, కొత్త ప్రతిభను పరిచయం చేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ప్లేస్ ఆయనకు తెగ నచ్చేసిందట. కానీ అక్కడ ఉండాలంటే భయమేస్తోంది అని అంటున్నారు. ఆయనకు అంత నచ్చి.. భయపెడుతున్నదేంటి? సోషల్ మీడియాలో వైరల్ ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ప్రకృతి(Nature) అంటే అందరికీ ఇష్టం. కొండలు, చెట్లు, నదులు, పక్షులు ఇలా వీటి మధ్య ఉంటే శరీరానికి దానికదే ఉత్సాహం, ఓ కొత్త శక్తి వస్తుంది. ఇక డబ్బున్న వాళ్లయితే నచ్చినచోటుకు ఈజీగా వెళ్ళిపోతారు. తాజాగా ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఓ వీడియో షేర్ చేశారు. వీడియోలో పర్వతాల(mountains) పైన కొండ చరియల అంచులను ఆనుకుని గాజు అద్దాలలతో ఓ గదిని(room with glass fencing) నిర్మించారు. ఆ గదికి కింద భాగం చెక్కతో తయారుచేశారు. గది సీలింగ్ భాగాన్ని దృఢంగా నిర్మించారు. దీని పై భాగంలో రేకులను సెట్ చేశారు. గదిలో ఓ పడక, దానిమీద తెల్లని దుప్పటితో ఎంతో నీట్ గా కనిపిస్తున్నాయి. ఓ వైపు వర్షం కురుస్తోంటే ఆ నీరు పైన రేకుల నుండి గది గాజు గోడల మీదుగా కిందకు వెళుతున్నాయి. మరోవైపు పచ్చని చెట్లు, కొండ అంచులలో లాంతర్ ను వేలాడదీసినట్టుగా ఉంది ఆ దృశ్యం.

Costly Water: హైదరాబాద్‌లో ఓ యువతికి షాకింగ్ అనుభవం.. ఒక్క వాటర్ బాటిల్ రూ.350.. నీళ్లు తాగాక ఆమె ఏం చేసిందంటే..!


ఈ వీడియోను anand mahindra తన ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. 'సాధారణంగా అందమైన ప్రాంతాలు చూసి నేను ఆశ్చర్యపోతుంటాను. కానీ ఎక్కడ చూసినా కురుస్తున్న దారుణమైన వర్షాల కారణంగా ఈ గదిలో ఒక రాత్రి కూడా ఉంటానని నేను అనుకోను' అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయిన ప్రమాదానికి, ఈ గదికి తేడా ఏమీ లేదు' అని ఒకరు అక్కడ ప్రమాద స్థాయిని కంపేర్ చేశారు. 'ఆ గదిలో ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఖచ్చితంగా కొన్ని రాత్రులు గడవాలి' అని ఇంకొకరు కామెంట్ చేసారు. 'ఇది ప్రకృతితో గేమ్ ఆడటం లాంటిది' అని మరికొందరు అంటున్నారు.

Viral News: పొలంలో పనిచేస్తుండగా బయటపడిందో పెట్టె.. అనుమానంగానే ఓపెన్ చేసిన రైతుకు భారీ షాక్.. 157 ఏళ్ల క్రితం నాటి..!


Updated Date - 2023-07-14T12:49:18+05:30 IST