Anand Mahindra: సిటీలో ఉంటున్నారా..? అయితే ఈ వీడియో మీ కోసమే.. ఆనంద్ మహీంద్రాయే ఫిదా అయిపోయారు..!
ABN , First Publish Date - 2023-06-30T13:49:58+05:30 IST
పట్టణాల్లో నివసించేవారు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వాటిలో ఇరుకిరుకు ఇళ్ళు ప్రధానమైనవి. ఈ ఇళ్ళలో అన్ని విధాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రానే ఈ వీడియో చూసి ఫిదా అయిపోయారంటే..
పట్టణ జీవితానికి, పల్లె జీవితానికి చాలా తేడా ఉంటుంది. ఉండే ఇల్లు దగ్గరనుండి మనిషి మెలిగే విధానం వరకు రెండింటికీ మధ్య తేడాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. పట్టణాల్లో నివసించేవారు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వాటిలో ఇరుకిరుకు ఇళ్ళు ప్రధానమైనవి. ఈ ఇళ్ళలో అన్ని విధాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రానే ఈ వీడియో చూసి ఫిదా అయిపోయారంటే ఆ వీడియో ఆయన్ను ఎంతగా ఇంప్రెస్ చేసిందో ఊహించుకోవచ్చు. పట్టణాలలో నివసించే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే వ్యాపారవేత్తలలో(business men)మొదటివరుసలో ఉంటారు. ఆయన ఎంతో ఆసక్తికరమైన సంగతులు, ప్రజలకు ఉపయోగపడే విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. పట్టణాలలో నివసించేవారికి ఎదురయ్యే పెద్ద ఇబ్బంది ఇరుకిరుకుగా ఉండే చిన్న చిన్న ఇళ్లు(small houses). అలాంటి ఇళ్లలో తమకున్న సామాను పెట్టుకోవడానికి కూడా సరిపడినంత స్థలం ఉండదు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో దీనికి మంచి పరిష్కారంగా కనిపిస్తుంది. ఇంట్లో వస్తువులు పెట్టుకోవడానికి సరిపడినంత స్పేస్ లేకపోవడంతో ఓ కుటుంబం తమ ఇంటి మెట్ల దారి కింద ఉన్న స్థలాన్ని అద్భుతంగా వినియోగించుకుంది. మెట్ల కింద ఉన్న స్పేస్(steps under space) లో పట్టే విధంగా చెక్కతో షెల్ఫ్ ఫర్నీచర్ ను తయారుచేయించుకుంది. వీడియోలో ఆ చెక్క ఫర్నీచర్(wood furniture)ను మెట్ల కింద ఉన్న స్పేస్ లో ఫిక్స్ చేయడం చూడచ్చు. ఇది స్థలాన్ని సద్వినియోగం చేసుకునేలానే కాకుండా ఆ గదికి కొత్త అందాన్నికూడా తెచ్చిపెట్టింది.
Eggs vs Paneer: కోడిగుడ్లు మంచిదా..? పనీర్ వాడటం బెస్టా..? బరువు తగ్గాలనుకునే వాళ్లు ఏది వాడాలంటే..!
ఈ వీడియోను anand mahindra తన ట్విట్టర్(Twitter) అకౌంట్ లో షేర్ చేశారు. 'ఈ స్పేస్ మేనేజ్మెంట్ నాకు ఎంతగానో నచ్చింది' అంటూ క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. హిమాన్షు బారియా అనే వినియోగదారు తను నివసించే గ్రామంలో కార్పెంటర్ వృత్తి చేస్తుంటాడు. అతను ఈ వీడియో చూసి తన గ్రామంలో ఒకరికి ఇలాంటిది తయారుచేసిచ్చి దాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు. ఇది ఆనంద్ మహీంద్రాను మరింత ఇంప్రెస్ చేసింది. ఐడియా చాలాబాగుంది అని కొందరు, వాటికి కింద చక్రాలు సెట్ చేస్తే ఆ ప్రాంతం క్లీన్ చేయడం సులభమవుతుందని మరికొందరు సలహాలు ఇచ్చారు.