Anand Mahindra: అత్యంత భయంకరమైన ప్రయాణం.. అక్కడకు వెళ్లాలని ఉంది.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా!

ABN , First Publish Date - 2023-07-23T19:45:06+05:30 IST

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు ఆసక్తికరంగా అనిపించిన వాటిని, నవ్వు తెప్పించిన వాటిని ట్విటర్‌లో పోస్ట్ చేసి అందరితో పంచుకుంటుంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఆసక్తికర వీడియో చాలా మందిని ఆకట్టుకుంది.

Anand Mahindra: అత్యంత భయంకరమైన ప్రయాణం.. అక్కడకు వెళ్లాలని ఉంది.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా!

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు ఆసక్తికరంగా అనిపించిన వాటిని, నవ్వు తెప్పించిన వాటిని ట్విటర్‌లో పోస్ట్ చేసి అందరితో పంచుకుంటుంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఆసక్తికర వీడియో చాలా మందిని ఆకట్టుకుంది. మహారాష్ట్రలోని కలావంతీ కోట (Kalavantin Durg) గురించి ఆనంద్ ట్వీట్ చేశారు. ఆ కోట ఎక్కాలని ఉందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆ కోటకు సంబంధించిన వీడియోను (Viral Video) పోస్ట్ చేశారు.

``మనదేశంలోనే ఉన్న కలావంతి కోటి గురించి నాకు తెలియదు. ఈ ట్రెక్కింగ్ పశ్చిమ కనుమల్లోనే అత్యంత భయంకరమైనది. దాదాపు 60 డిగ్రీల ఏటవాలులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నేను ఈ ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు శరీరం సహకరిస్తుందో లేదో చూడాలి`` అని ఆనంద్ ట్వీట్ చేశారు. ఎవరో ఒక వ్యక్తి ఆ కోట నుంచి కిందకు దిగుతుండగా తీసిన వీడియోను ఆనంద్ షేర్ చేశారు. ఆ మార్గం చూడడానికే చాలా భయంకరంగా ఉంది.

Viral Video: సింహానికి చుక్కలు చూపించిన గేదెలు.. గాల్లోకి ఎగరేసి ఎలా దాడి చేశాయో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

ఆనంద్ చేసిన ఈ ట్వీట్ (Anand Mahindra Tweet) సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటివరకు 16 లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. 15 వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియో అద్భుతంగా ఉందని చాలా మంది కామెంట్లు చేశారు. చాలా మంది ఆ ట్రెక్కింగ్ చేయాలనుకుంటున్నట్టు కామెంట్లు చేశారు. కొందరు మాత్రం అలాంటి ప్రమాదకర ప్రయాణాలకు దూరంగా ఉండాలని హితువు చెప్పారు.

Updated Date - 2023-07-23T19:45:06+05:30 IST