Viral News: టాలెంట్ అంటే ఇది బ్రో.. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చదవకుండానే రూ.1.25 కోట్ల జీతం

ABN , First Publish Date - 2023-07-25T18:06:25+05:30 IST

సాధారణంగా లక్షలు, కోట్లలో జీతాలు ఉండే ఉద్యోగాలంటే అందరికీ సాఫ్ట్ వేర్ రంగమే గుర్తొస్తుంది. అయితే ఆ ఉద్యోగాలు చేయాలంటే ఐఐటీ (IIT), ఐఐఎమ్ (IIM) ఎన్‌ఐటీ (NIT) వంటి గొప్ప చదువులు పూర్తి చేసి ఉండాలని అంతా అనుకుంటారు. కానీ ఇవేవి లేకుండానే ప్రముఖ ఆన్‌లైన్ కంపెనీ అమెజాన్‌లో ఓ వ్యక్తి కోటి రూపాయలకు పైగా వేతనంతో ఉద్యోగం సంపాదించాడు.

Viral News: టాలెంట్ అంటే ఇది బ్రో.. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చదవకుండానే రూ.1.25 కోట్ల జీతం

సాధారణంగా లక్షలు, కోట్లలో జీతాలు ఉండే ఉద్యోగాలంటే అందరికీ సాఫ్ట్ వేర్ రంగమే గుర్తొస్తుంది. అయితే ఆ ఉద్యోగాలు చేయాలంటే ఐఐటీ (IIT), ఐఐఎమ్ (IIM) ఎన్‌ఐటీ (NIT) వంటి ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో గొప్ప చదువులు పూర్తి చేసి ఉండాలని అంతా భావిస్తుంటారు. కానీ ఇవేవి లేకుండానే ప్రముఖ ఆన్‌లైన్ కంపెనీ అమెజాన్‌లో ఓ యువకుడ కోటి రూపాయలకు పైగా వేతనంతో ఉద్యోగాన్ని సంపాదించాడు. అలహాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో అనురాగ్ మకాడే అనే విద్యార్థి బీటెక్ చదువుతున్నాడు. ప్రతి ఏడాది ఐఐటీ పూర్తి చేసిన అనేక మంది విద్యార్థులు భారీ ప్యాకేజీలతో ప్లేస్‌మెంట్స్ పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఇదే విద్యాసంస్థకు చెందిన అనేక మంది విద్యార్థులకు ఈ ఏడాది కూడా మంచి ప్లేస్‌మెంట్‌లు లభించాయి.


వారిలో ఐదుగురు విద్యార్థులు ఏకంగా కోటి రూపాయల వార్షిక ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌లు పొందారు. అందులో అనురాగ్ మకాడే ఒకరు. అమెరికాలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నుంచి అతనికి ఏకంగా రూ.1.25 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం రావడం గమనార్హం. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. అనురాగ్ మకాడే ఐఐటీ, ఐఐఎమ్, ఎన్‌ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదవలేదు. అలహాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో బీటెక్ చదువుతున్నాడు. బీటెక్ చదువుతున్న విద్యార్థికి కోటి రూ.1.25 కోట్ల ప్యాకెజీ దక్కడం మామూలు విషయం కాదనే చెప్పుకోవాలి. దీంతో టాలెంట్ ఉంటే ప్రతిష్టాత్మక యూనివర్సిటీలే అక్కర్లేదని, నైపుణ్యాలు ఉంటే ఏ స్థాయికైనా వెళ్లొచ్చనే దానికి అనురాగ్ మకాడేనే ఉదాహరణగా చెప్పవచ్చు.

ఈ విషయాన్ని అనురాగ్ మకాడే లింక్‌డ్‌ఇన్‌లో ప్రకటించాడు. అమెజాన్‌లో ప్రంటెండ్ ఇంజనీర్‌గా చేరినట్టుగా చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అనురాగ్ మకాడే ఫేస్‌బుక్ ప్రొఫైల్ ప్రకారం అతను నాసిక్‌కు చెందినవాడు. అనురాగ్ అమెజాన్‌లో ఉద్యోగం పొందడానికి ముందే బీటెక్ చదువుతూనే.. బెంగళూరులోని క్యూర్-ఫిట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్‌గా పని చేశారు. అనురాగ్‌తోపాటు కోటి రూపాయల జీతంతో ప్లేస్‌మెంట్‌లు పొందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రథమ్ ప్రకాష్ గుప్తాకు గూగుల్‌లో రూ.1.4 కోట్ల ప్యాకేజీని, అఖిల్ సింగ్‌కు రూబ్రిక్‌లో రూ.1.2 కోట్ల ప్యాకేజీ, పాలక్ మిట్టల్‌కు రూ.1 కోటికిపైగా ప్యాకేజీతో అమెజాన్‌లో ప్లేస్‌మెంట్‌ లభించాయి.

Updated Date - 2023-07-26T13:03:07+05:30 IST