ఓ చిన్న కాటన్ ముక్క చాలు.. పుచ్చకాయ సహజంగా పండిందో.. రసాయనాలతో పండించారో ఈజీగా తెలుసుకోవచ్చు..!

ABN , First Publish Date - 2023-06-13T10:55:21+05:30 IST

పుచ్చకాయను కోసిన తరువాత అది ఎర్రగా కనబడితే అది ఇక పర్ఫేక్ట్ అనుకునేవారు చాలా ఎక్కువ. కానీ ఎర్రగా ఉన్న పుచ్చకాయ వెనుక ఊహించని దారుణాలున్నాయి.

ఓ చిన్న కాటన్ ముక్క చాలు.. పుచ్చకాయ సహజంగా పండిందో.. రసాయనాలతో పండించారో ఈజీగా తెలుసుకోవచ్చు..!

పుచ్చకాయ అంటే పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టం. ఎర్రగా, తియ్యగా ఎక్కువ నీటిశాతం నిండిన ఈ పండు ఒంట్లో వేడిని తగ్గించి, చలువ చేకూరుస్తుంది. ఎక్కువసేపు కడుపునిండిన ఫీల్ ఇస్తుంది కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారికి కూడా చాలా మంచిది. దీనివల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే పుచ్చకాయను కోసిన తరువాత అది ఎర్రగా కనబడితే అది ఇక పర్ఫేక్ట్ అనుకునేవారు చాలా ఎక్కువ. కానీ ఎర్రగా ఉన్న పుచ్చకాయ వెనుక ఊహించని దారుణాలున్నాయి. పుచ్చకాయ ఎర్రగా బాగా పెరగడానికి ఎరిథ్రోసిన్(Erythrosine) ఉపయోగిస్తారు. ఇలా ఎరిథ్రోసిన్ రసాయనాల ద్వారా(Erythrosine adulterated watermelon) ద్వారా పండిన పుచ్చకాయలు తినడం చాలా ప్రమాదం. థైరాయిడ్ తో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం కొన్న పుచ్చకాయ ఎరిథ్రోసిన్ ఇంజెక్షన్ ద్వారా పండినదా లేదా సహజంగా(organic watermelon) పండినదా తెలుసుకుంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఇందుకోసం కేవలం ఓ చిన్న కాటన్ ముక్క(cotton ball) ఉంటే చాలు. ఈ ట్రిక్ ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రజలకు వివరించింది. చిన్న కాటన్ ముక్క సహాయంతో పుచ్చకాయను ఎలా పరీక్షించాలో తెలుసుకుంటే..

మొదట పుచ్చకాయను రెండు సమాన భాగాలుగా(Two halves) కట్ చేయాలి. ఇలా కట్ చేసిన పుచ్చకాయ మధ్యభాగంలో ఉన్న ఎర్రటి కండ మీద పుచ్చకాయ రసం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పుచ్చకాయ సహజంగా పండినదో కాదో తెలుసుకోవడానికి ఒక చిన్న కాటన్ ముక్క తీసుకోవాలి.

పుచ్చకాయ మధ్యబాగంలో ఉన్న కండ మీద కాటన్ ముక్కతో మరీ గట్టిగా కాకుండా కాస్త ఒత్తిడితో రుద్దాలి(rub with cotton ball). ఈ సమయంలో పుచ్చకాయ రసాన్ని కాటన్ బాల్ పీల్చుకుంటుంది. ఈ సమయంలో కాటన్ ముక్క రంగు మారకుండా తెల్లగానే ఉంటే(cotton ball can't change the colour it is unadulterated watermelon) ఆ పుచ్చకాయ సహజంగా పండించిందని అర్థం. అలా కాకుండా కాటన్ ముక్కకు ఎర్రగా పుప్పొడిలాగా పుచ్చకాయ కండ అంటుకుంటే అది రసాయనాలు ఉపయోగించి పండించిన పుచ్చకాయ అని అర్థం(cotton ball change the colour it is adulterated watermelon). ఇలా చాలా ఈజీగా మంచి పుచ్చకాయ ఏదో తెలుసుకోవచ్చు.

ఈ పరీక్షను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) వారు విడుదల చేశారు. పుచ్చకాయల విషయంలో చాలామంది రంగు చూసి మోసపోతుంటారు. ఈ మోసాన్ని అడ్డుకట్ట వెయ్యడానికి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడటానికి ఈ పరీక్ష చాలా ఉపయోగపడుతుంది

Updated Date - 2023-06-13T11:21:03+05:30 IST