Aunties vs Couple: మెట్రో రైల్లో కొత్త జంట సరసాలు.. ఇదేం పనంటూ హెచ్చరించిన మహిళలు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-06-27T12:44:39+05:30 IST
మెట్రో రైళ్ళు మహానగరాల్లో ప్రజల ప్రయాణ సౌకర్యార్థం ఏర్పాటుచేసినవి. వీటి గురించి చెప్పుకుని దేశం గర్వించేది ఒకప్పుడు. అయితే ఇప్పుడు సీన్ మారింది
మెట్రో రైళ్ళు మహానగరాల్లో ప్రజల ప్రయాణ సౌకర్యార్థం ఏర్పాటుచేసినవి. వీటి గురించి చెప్పుకుని దేశం గర్వించేది ఒకప్పుడు. అయితే ఇప్పుడు సీన్ మారింది. మెట్రో రైళ్ళు అడ్డమైన పనులకు కేంద్రంగా మారుతున్నాయి. కుర్రాళ్ళ వింత చేష్టలు, యువతీయువకులు హద్దుమీరి ప్రవర్తించడాలు మెట్రో ట్రైన్లలోనే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. తాజాగా ఓ కొత్త జంట మెట్రోరైల్లో సరసాలు ఆడుతోంటే పక్కనే ఉన్న మహిళలు ఇదేంపనంటూ హెచ్చరించారు. ఆ తరువాత జరిగిన సీన్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఢిల్లీ మెట్రోలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
మెట్రో రైళ్ళలో(Metro trains) జరిగే ప్రతి విషయం ఇప్పట్లో చాలా తొందరగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియా వేగమే ఇందుకు కారణం. తాజాగా ఢిల్లీ మెట్రోలో(Delhi metro) ఓ సంఘటన చోటు చేసుకుంది. వీడియోలో ఓ జంట నిలబడుకుని ఇద్దరు మహిళలతో వాగ్వివాదం చేయడం చూడొచ్చు. తెలిసిన సమాచారం ప్రకారం ఆ జంటకు కొత్తగా పెళ్ళయ్యింది(new married couple). వారు ఢిల్లీ మెట్రో ఎక్కిన తరువాత సరసాలు ఆడటం మొదలుపెట్టింది(couple behave romantic in Delhi metro). వారికి దగ్గరలోనే రెండు సీట్లలో ఇద్దరు మహిళలు కూర్చుని ఉన్నారు. ఆ జంట పబ్లిక్ గా సరసాలు ఆడటం ఆ మహిళలకు నచ్చలేదు. దీంతో వారు ఆ జంటతో 'మీకు కాస్త సిగ్గు ఉండాలి, పబ్లిగ్ గా ట్రైన్లో ఇలా చేయకండి' అని మందలించారు. కానీ ఆ జంట ఆ మహిళల మీద రెచ్చిపోయారు. ఆ కుర్రాడు ఆ మహిళలతో వాగ్వివాదానికి దిగాడు. 'మేం ఎందుకు సిగ్గుపడతాం.. మేము మాకు నచ్చినట్టు ఉంటాం, చెప్పడానికి మీరెవరు? మీరు మీ పనులు చూసుకోండి' అంటూ దురుసుగా సమాధానం ఇచ్చాడు. ఆ తరువాత ఆ మహిళలకు, కుర్రాడికి మధ్య చాలాసేపు వాదోపవాదాలు జరిగాయి.
Viral Video: ఎలా వస్తాయయ్యా ఇలాంటి ఐడియాలు.. ట్రాఫిక్ చలానా తప్పించుకోవడానికి ఇంత రిస్క్ చేయాలా..?
ఈ వీడియో Ghar Ke Kalesh అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆ జంట చేసిన పనిని విమర్శిస్తుండగా, మరికొందరు వారికి మద్దతు ఇస్తున్నారు. 'నేను ఇప్పుడు ఢిల్లీ ట్రిప్ రద్దు చేసుకోవాలా?' అంటూ ఒకరు కామెంట్ చేశారు. 'ఆ జంటను వారి తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు' అంటూ మరొకరు కామెంట్ చేశారు. 'ఆ జంట సంతోషంగా ఉండటం ఆ మహిళలు చూడలేకపోతున్నారు, ఎంత అసూయ వాళ్ళకు' అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.