Bank Loans: బ్యాంక్ లోన్ తీసుకున్నారా..? పొరపాటున కూడా ఈ మిస్టేక్ చేయకండి.. లేదంటే ఇబ్బందుల్లో పడటం ఖాయం..!
ABN , First Publish Date - 2023-06-16T17:40:36+05:30 IST
ఒకప్పుడు ఇల్లు, కారు కొనాలన్నా, వ్యాపారాలు మొదలుపెట్టాలన్నా రుపాయికి రుపాయి కూడబెట్టి పెద్ద మొత్తం అయ్యాక చేసేవారు. కానీ ఇప్పుడు ప్రజల ఆలోచనా తీరు మారింది. మొదట బ్యాంకులలో లోన్ తీసుకుని తమకు నచ్చినవి కొనుక్కుంటున్నారు. ఆ తరువాత నెల నెలా లోన్ చెల్లిస్తున్నారు. అయితే చాలామందికి నెలవారీ లోన్ చెల్లింపుల విషయంలో ఇబ్బందులొస్తుంటాయి. ఇటు లోన్ చెల్లించలేక, అటు అధికవడ్డీ, జరిమానా కట్టలేక విసిగిపోతుంటారు.
ఒకప్పుడు ఇల్లు, కారు కొనాలన్నా, వ్యాపారాలు మొదలుపెట్టాలన్నా రుపాయికి రుపాయి కూడబెట్టి పెద్ద మొత్తం అయ్యాక చేసేవారు. కానీ ఇప్పుడు ప్రజల ఆలోచనా తీరు మారింది. మొదట బ్యాంకులలో లోన్ తీసుకుని తమకు నచ్చినవి కొనుక్కుంటున్నారు. ఆ తరువాత నెల నెలా లోన్ చెల్లిస్తున్నారు. అయితే చాలామంది లోన్ తీసుకున్నప్పుడు ' నెల నెలా కట్టేయచ్చులే పెద్ద సమస్య ఏమీ ఉండదు' అనుకుంటారు. కానీ పరిస్థితుల కారణంగా కట్టలేకపోతారు. ఇలాంటి సందర్భాలలో బ్యాంకు వారు అధిక వడ్డీ, జరిమానా విధిస్తారు. ఇది కేవలం ఒక నెల కాకుండా ఎక్కువ నెలలు కొనసాగితే రుణగ్రహీతలు చాలా విసుగుచెందుతారు. ఇలాంటప్పుడు తెలియకుండానే పప్పులో కాలేస్తారు. ఇలా చేసే ఒకే ఒక తప్పు వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసుకుంటే..
సాధారణంగా బ్యాంకు రుణాలు(Bank loans) తీసుకున్నప్పుడు అవి తిరిగిచెల్లించాలనే అందరూ అనుకుంటారు. కానీ పరిస్థితుల ప్రభావం కారణంగా కొన్నిసార్లు లోన్లు కట్టలేకపోతారు(inability to pay the loan). ఇలా లోన్ చెల్లించలేని పక్షంలో బ్యాంకు వారు వడ్జీ(Interest), జరిమానా(fine) విధిస్తారు. రుణం తీసుకున్నవారు ఈ అధిక వడ్డీ, జరిమానా కట్టలేక విసిగిపోయి రుణాన్ని పరిష్కిరంచుకునే దిశగా ఆలోచిస్తారు. మూడు నెలల పాటు వరుసగా నెలవారీ చెల్లింపు చేయకపోతే బ్యాంకు వారు రుణగ్రహీతలను కారణాలు అడుగుతారు. ఆ తరువాత బ్యాంక్ లోన్ సెటిల్(bank loan settle)చేయడానికి అవకాశం ఇస్తారు. వడ్డీ, జరిమానా మినహాయించి తీసుకున్న లోను మొత్తాన్ని ఒకేసారి తిరిగిచెల్లించడమే(one time loan payment) లోన్ సెటిల్ చేయడం. ఇలా చేయడం వల్ల లోన్ భారం తీరిపోతుంది. కానీ రుణం తీసుకున్నవారికి భవిష్యత్తులో చాలా నష్టాలు ఉన్నాయి.
Viral: బాబోయ్.. ఇదేం వింత జీవి.. చూస్తేనే భయపడిపోతున్న జనం.. అది ఉమ్మితే నోట్లోంచి వస్తున్నదేంటో చూసి..!
లోన్ సెటిల్ చేసుకోవడం అంటే లోన్ క్లోజ్ కావడం కాదు. లోన్ సెటిల్ చేసుకున్నప్పుడు బ్యాంకు నుండి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలకు(credit rating agency) సమాచారం వెళుతుంది. అక్కడ లోన్ సెటిల్డ్(loan settled) అనే నమోదు అవుతుంది. రుణగ్రహీత చెల్లించాల్సిన మొత్తం సాధారణ పరిస్థితిలో క్లోజ్ కాలేదని అది సెటిల్ చేయబడిందని అందులో ఉంటుంది. ఈ కారణంగా క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం పడుతుంది(effect on credit score). తదుపరి లోన్లు పొందాలంటే బ్యాంకులు లోన్లు అంత ఈజీగా ఇవ్వవు. కనీసం క్రెడిట్ కార్డ్ పొందాలన్నా సమస్య ఏర్పడుతుంది(problem to get credit card). అందుకే బ్యాంకు లోన్ విషయంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే లోన్ సెటిల్ ఆప్షన్ ఎంచుకోకుండా ఏదో విధంగా బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో బ్యాంకు వారితో చర్చించి సరైన నిర్ణయాన్ని తీసుకోవచ్చు.