Viral Video: పులికి కూడా అంత ఈజీ కాదు.. జింక వెనుక పులి పరుగులు.. చివరకు ఏం జరిగిందో చూడండి..
ABN , First Publish Date - 2023-07-15T11:45:52+05:30 IST
అడవిలో పులిని మించిన వేటగాడు లేడనుకుంటాం. ఒక జంతువును చూసిన తర్వాత పులి వేటాడే పద్ధతి గురించి ఎన్నో వీడియోలు చూసి ఉంటాం. అయితే అంత గొప్ప వేటగాడిగా పేరు తెచ్చుకున్న పులి సక్సెస్ రేట్ కేవలం 5 శాతం మాత్రమేనట. అంటే 100 సార్లు తీవ్రంగా ప్రయత్నిస్తే కేవలం 5 సార్లు మాత్రమే పులికి ఆహారం దొరుకుతుంది.
అడవిలో పులిని (Tiger) మించిన వేటగాడు లేడనుకుంటాం. ఒక జంతువును చూసిన తర్వాత పులి వేటాడే పద్ధతి గురించి ఎన్నో వీడియోలు (Tiger Hunting Videos) చూసి ఉంటాం. అయితే అంత గొప్ప వేటగాడిగా పేరు తెచ్చుకున్న పులి సక్సెస్ రేట్ కేవలం 5 శాతం మాత్రమేనట. అంటే 100 సార్లు తీవ్రంగా ప్రయత్నిస్తే కేవలం 5 సార్లు మాత్రమే పులికి ఆహారం దొరుకుతుంది. యూఎస్ ఫీల్డ్ బ్లాగిస్ట్ జార్జ్ స్కాలర్ కన్హా నేషనల్ పార్క్‌లో చేసిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది.
జార్జ్ స్కాలర్ అధ్యయనాన్ని రుజువు చేసే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. IFS అధికారి సుశాంత నంద ఈ వీడియోను షేర్ చేస్తూ.. కప్‌నకు, లిప్‌నకు మధ్య చాలా జరుగుతుందని కామెంట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ జింక (Deer)ను వేటాడేందుకు పులి శాయశక్తులా ప్రయత్నించింది. అమిత వేగంతో జింకను అనుసరించింది (Tiger Hunting Deer). అయితే ఆ జింక ఆ పులికి అందకుండా మరింత వేగంగా పరిగెత్తింది. కొద్దిసేపటి తర్వాత ఆ జింకను పట్టుకోలేక పులి ఆగిపోయింది. ఆ ఛేజింగ్ వీడియో చాలా మందిని ఆకట్టుకుంది (Animal Videos).
Snake Video: చెప్పుల కోసం పెట్టిన స్టాండ్‌ను పట్టు మంచంలా మార్చేసుకున్న కోబ్రా.. దాని మీదకు ఎక్కి మరీ..!
ఈ వీడియోను ఇప్పటివరకు 1.1 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేశారు. ``ఆ జింక చాలా తెలివైనది. రాళ్ల మీద పులి వేగంగా పరిగెత్తలేదని గ్రహించింది``, ``ఆ అధ్యయనం నిజమే.. పులి తన జీవితంలో 95 శాతం ఆకలితోనే ఉంటుంది``, ``పులుల కంటే చిరుతలు మంచి వేటగాళ్లు``, ``బతకడం కోసం జింక పోరాటం ముందు ఆకలి తీర్చుకోవాలనే పులి ఆరాటం ఓడిపోయింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.