Bike Helmet: హెల్మెట్లను బయటే ఉంచుతున్నారా..? అయితే జర జాగ్రత్త.. ఇలా ఎందుకు చెబుతున్నామో దీన్ని చూస్తే మీకే అర్థమవుతుంది..!
ABN , First Publish Date - 2023-06-23T16:16:14+05:30 IST
హెల్మెట్లు(helmet) ప్రాణాలను కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందుకే ప్రభుత్వాలు కూడా హెల్మెట్ల వాడకం తప్పనిసరి చేశాయి. అయితే బయట నుండి ఇంటికి రాగానే హెల్మెట్లను బయటే ఉంచుతుంటారు. ఓ వ్యక్తి కూడా అదే విధంగా ఇంటి బయట తన హెల్మెట్ ను ఉంచాడు. ఆ తరువాత అందులో నుండి వింత శబ్దాలు వినిపించాయి. ఏమిటా అని చూస్తే..
ద్విచక్రవాహనాలలో వెళ్ళేవారు హెల్మెట్ తప్పక ఉపయోగించాలి. హెల్మెట్ పెద్ద ప్రమాదాల నుండి ప్రాణాలను కాపాడుతుంది. అయితే బయట నుండి ఇంటికి రాగానే చాలామంది హెల్మెట్లను ఇంటిబయట ఉన్నమెట్ల మీదనో లేక అరుగుల మీదనో ఉంచుతుంటారు. హెల్మెట్లను బయటే పెట్టడం ఎంత ప్రమాదమో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. అంతేకాదు హెల్మెట్లను బయట పెట్టాలంటే ఇకమీదట భయపడతారు కూడా. అందరినీ అంతగా భయపెట్టే విషయం ఇందులో ఏముందో తెలుసుకుంటే..
హెల్మెట్లు(helmet) ప్రాణాలను కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందుకే ప్రభుత్వాలు కూడా హెల్మెట్ల వాడకం తప్పనిసరి చేశాయి. అయితే బయట నుండి ఇంటికి రాగానే హెల్మెట్లను బయటే ఉంచుతుంటారు. ఓ వ్యక్తి కూడా అదే విధంగా ఇంటి బయట తన హెల్మెట్ ను ఉంచాడు. ఆ తరువాత అతను బయటకు వెళ్లేందుకు ఇంట్లో నుండి బయటకు వచ్చాడు. అతనికి ఇంటి బయట ఏదో వింత శబ్దాలు వినిపించాయి. 'ఏంటిది ఇలా వింతగా శబ్దం వస్తోంది' అని చుట్టూరా గమనించాడు. శబ్దం ఎక్కడినుండి వస్తుందా అని రిక్కించి వినగా ఆ శబ్దం బైక్ వైపునుండి వస్తున్నట్టు అర్థమైంది. బైక్ అంతా పరిశీలనగా చూస్తే ఎక్కడా ఏమీ కనిపించలేదు. ఆ తరువాత అతని కన్ను హెల్మెట్ మీద పడింది. హెల్మెట్ చేతుల్లోకి తీసుకోగానే ఆ శబ్దం మరింత అధికమైంది. ఏముందా అని పరిశీలించిన అతనికి ఒళ్లు జల్లుమంది. వెంటనే కిచన్లో పుల్కాలు తిప్పడానికి, ఇడ్లీలు వడ్డించడానికి ఉపయోగించే స్టీల్ పట్టకార తెచ్చి హెల్మెట్ లోపలికి జొప్పించి చిన్నపాము పిల్లను బయటకు తీశాడు. అతను ఏ మాత్రం గమనించుకోకుండా హెల్మెట్ పెట్టుకుని ఉంటే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.
Viral Video: రోడ్డుపై నడుస్తున్న భార్యాభర్తలు.. సడన్‌గా వాళ్ల దగ్గరకు వచ్చిందో బైక్.. ఎందుకొచ్చారో గ్రహించేలోపే ఊహించని ట్విస్ట్..!
ఈ వీడియోను irinjalakudavoice అనే ఇన్స్టాగ్రామ్ పేజీ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భయంతో వణికిపోతున్నారు. వర్షాల సమయంలోనూ, వేసవి ఉక్కపోతలకు పాములు బయటకు వస్తుంటాయని, ఆరుబయట హెల్మెట్లు ఉంచడం మంచిది కాదని అంటున్నారు. 'అతను చాలా అదృష్టపంతుడు. హెల్మెట్ లో పాము ఉందని ముందే కనిపెట్టాడు' అని అంటున్నారు. 'అది చాలా విషపూరితమైన పాము, దేవుడికి నిజంగా ధన్యవాదాలు. పెద్ద ప్రమాదం తప్పింది' అని ఇంకొకరు అన్నారు. 'హెల్మెట్ వాడేవారికి ఇప్పుడొక కొత్త భయం మొదలైంది' అని మరికొందరు అంటున్నారు.