Bachelor Cooking: బ్యాచులర్ కుర్రాళ్లూ.. బీ కేర్‌ఫుల్.. రూమ్‌లో వంట చేస్తోంటే.. సడన్‌గా పేలిన కుక్కర్.. చివరకు..!

ABN , First Publish Date - 2023-07-18T16:17:56+05:30 IST

గ్యాస్, కుక్కర్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు.

Bachelor Cooking: బ్యాచులర్ కుర్రాళ్లూ.. బీ కేర్‌ఫుల్.. రూమ్‌లో వంట చేస్తోంటే.. సడన్‌గా పేలిన కుక్కర్.. చివరకు..!

చదువు కోసమో, ఉద్యోగం కోసమో చాలా మంది కుర్రాళ్లు సిటీలకు వెళ్తుంటారు. అక్కడ అద్దెకు ఇళ్లు తీసుకుని స్వయంగా వంట (Cooking) చేసుకుంటూ ఉంటారు. చాలా మంది నేర్చుకుంటారు. అయితే ఒక్కోసారి అజాగ్రత్తగా ఉండి ప్రమాదాలకు గురవుతుంటారు. గ్యాస్ (Gas Stove), కుక్కర్ల (Rice Cooker) విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు.

funny_bebo_306 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుర్రాడు గ్యాస్ స్టవ్‌పై వంట చేస్తున్నాడు. కుక్కర్లో రైస్ పెట్టాడు. పక్కన కూర వండేందుకు వెళ్తున్నాడు. అయితే ఆ సమయంలో హఠాత్తుగా కుక్కర్ (Rice Cooker Explodes) పేలిపోయింది. దాంతో పక్కన ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురైపోయాయి. అయితే ఆ కుర్రాడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Shocking: కోడి రక్తాన్ని చూపించి రూ.3 కోట్లు కొల్లగొట్టారు.. ఈ మహిళ తెలివి ముందు దేశముదుర్లు కూడా బలాదూర్..!

ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ లభించాయి. దాదాపు 3 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``కుక్కర్ గురించి తెలియకపోతే దానిని ఉపయోగించకపోవడమే మంచిది``, ``ఆ కుర్రాడి అదృష్టం బాగుంది``, ``కుక్కర్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-18T16:17:56+05:30 IST