Viral Video: తరగతి గదిలోనే విద్యార్థులతో ఇలాంటి డాన్సులేంటి..? ఓ టీచర్‌పై తల్లిదండ్రుల ఆగ్రహం.. దెబ్బకు ఉద్యోగం ఊస్ట్..!

ABN , First Publish Date - 2023-05-16T15:19:59+05:30 IST

ఓ పంతులమ్మ.. తన చేష్టలతో గుడిలాంటి బడిని బూతు బడిగా మార్చేసింది. అందుకు తగిన మూల్యం చెల్లించుకుని

Viral Video: తరగతి గదిలోనే విద్యార్థులతో ఇలాంటి డాన్సులేంటి..? ఓ టీచర్‌పై తల్లిదండ్రుల ఆగ్రహం.. దెబ్బకు ఉద్యోగం ఊస్ట్..!
Viral Video

బడి అంటే ఒక దేవాలయం లాంటిది. గుడిని ఎంత పవిత్రంగా చూస్తారో.. బడిని కూడా అంతే పవిత్రంగా చూస్తారు. ఇక విద్యార్థుల సంగతికి వస్తే.. వారికి చదువే లోకంగా ఉంటుంది. చెడేదో.. మంచేదో తెలియని వయసు వారిది. ఆ పసి మనసులకు ఏం నేర్పిస్తారో.. అదే మైండ్‌కు ఎక్కించుకుంటారు. అంతేకాదు పిల్లలు.. తల్లిదండ్రుల తర్వాత ఎక్కువగా గడిపేది గురువుల మధ్యలోనే. అందుకే విద్యార్థుల భవిష్యత్ అంతా ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుంది. గనుక వారు అటూ.. ఇటూగా ఉంటే పిల్లల ఫ్యూచర్ నాశనం అయిపోతుంది. అందుకే గురువులనే వారు పిల్లలకు మాదిరిగా ఉండాలని పెద్దలు.. అనుభవజ్ఞులు సూచిస్తుంటారు. ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.

ఏ స్కూలైనా విద్యార్థులకు గానీ.. టీచర్లకు గానీ ఒక డ్రస్ కోడ్ ఉంటుంది. ఆ క్రమంలో అందరూ నడుచుకుంటారు. ఇంకా చెప్పాలంటే విద్యార్థులు ఎలాంటి దుస్తులు ధరించినా ఉపాధ్యాయులు మాత్రం ఇంకా గొప్పగా తమ స్థాయికి తగిన విధంగా బట్టలు వేసుకుంటారు. వారు వేసుకునే డ్రస్‌ను బట్టే పిల్లలకు సభ్యతా.. సంస్కారం నేర్పిస్తుంటారు. అలాంటి ఉన్నతమైన గౌరవం కలిగిన వృత్తిలో ఉన్న ఓ పంతులమ్మ.. తన చేష్టలతో గుడిలాంటి బడిని బూతు బడిగా మార్చేసింది. అందుకు తగిన మూల్యం చెల్లించుకుని నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఈ సంఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది.

సిబెల్లీ ఫెరీరా (Cibelly Ferreira) అనే ఓ ఉపాధ్యాయురాలు.. బ్రెజిల్‌ (Brazil) లోని ఓ స్కూల్‌లో ఇంగ్లీష్‌ టీచర్‌గా (English teacher) పనిచేస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. టిక్‌టాక్‌లో 9.8 మిలియన్ల (TikTok dance videos) మంది ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ల మంది ఉన్నారు. తన అశ్లీల నృత్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేసి పాపులారిటీ సంపాదించుకుంది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ పంతులమ్మ.. తన చేష్టలను తరగతి గది దాకా తీసుకొచ్చింది. పొట్టి.. పొట్టి దుస్తులు వేసుకొచ్చి మగ విద్యార్థులతో కలిసి అశ్లీలంగా డ్యాన్సులు చూస్తూ టిక్‌టాక్.. ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అంతే ఈ వీడియోలు కాస్త.. తల్లిదండ్రుల కంట్లో పడ్డాయి. ఒక్కసారిగా ఆమె తీరుపై పేరెంట్స్, నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు.

విద్యార్థులతో ఆమె చేసిన డ్యాన్స్‌ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆమె తీరుపై కొందరు మండి పడుతుండగా.. మరికొందరు మద్దతుగా నిల్వడం ఆశ్చర్యం కలిగించింది.

సోషల్‌ నెట్‌వర్క్‌లు, టెక్నాలజీకి వ్యతిరేకంగా విద్యార్థులు బోధనపై దృష్టి కేంద్రీకరించడం ఎంత కష్టమో తనకు తెలుసు అని ఫెరీరా చెప్పుకొచ్చింది. విద్యార్థుల ఆసక్తిని అనుకూలంగా మలుచుకొని బోధనను వారికి చేరువ చేసేందుకే ఇలా చేస్తున్నట్టు ఫెరీరా స్థానిక మీడియాతో చెప్పుకొచ్చింది.

తరగతి గదిలో అసభ్యకరమైన వస్త్రధారణలో విద్యార్థులతో స్టెప్పులేయడంపై పలువురు నెటిజన్లు మండిపడుతుంటే.. మరోవైపు ఫెరీరా అభిమానులతో పాటు మరికొందరు నెటిజన్లు మాత్రం ఆమె చర్యలను సమర్థిస్తున్నారు. విద్యను మరింత వినోదభరితంగా అందిస్తున్నారంటూ మద్దతుగా నిలుస్తున్నారు. తరగతి గదిలో విద్యార్థులకు బోధనపై ఆసక్తిని పెంచేందుకు సరదాగా నృత్యం చేస్తూ ప్రపంచాన్ని ప్రేమలో పడేలా చేసిన సిబెల్లీని ఉద్యోగం నుంచి తొలగించడం దురదృష్టకరమంటూ ఇంకొందరు ట్వీట్లు పెట్టడం విశేషం.

Updated Date - 2023-05-16T15:19:59+05:30 IST