Viral: పెళ్లిలో వరుడికి కండిషన్లు.. వివాహ వేడుకలో అగ్రిమెంట్‌పై సంతకం పెట్టించుకున్న వధువు స్నేహితులు!

ABN , First Publish Date - 2023-07-28T21:12:02+05:30 IST

వివాహం అనేది ఎవరి జీవితంలోనైనా మరపురాని ఘట్టం. ముఖ్యంగా మహిళ పెళ్లితో వేరే ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. ఒకవైపు సంతోషంగానే ఉన్నా, మరోవైపు ఆమెకు ఉండాల్సిన భయాలు ఆమెకు ఉంటాయి. కాబోయే భర్త, అత్తింటి వారు ఎలా చూసుకుంటారో అనే అనుమానం ఉండనే ఉంటుంది.

Viral: పెళ్లిలో వరుడికి కండిషన్లు.. వివాహ వేడుకలో అగ్రిమెంట్‌పై సంతకం పెట్టించుకున్న వధువు స్నేహితులు!

వివాహం (Marriage) అనేది ఎవరి జీవితంలోనైనా మరపురాని ఘట్టం. ముఖ్యంగా మహిళ పెళ్లితో వేరే ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. ఒకవైపు సంతోషంగానే ఉన్నా, మరోవైపు ఆమెకు ఉండాల్సిన భయాలు ఆమెకు ఉంటాయి. కాబోయే భర్త, అత్తింటి వారు ఎలా చూసుకుంటారో అనే అనుమానం ఉండనే ఉంటుంది. భర్తపై, అతని కుటుంబంపై నమ్మకంతో ముందడుగు వేయడం తప్ప ఆమె చేయగలిగిందేం ఉండదు. అయితే తాజాగా జరిగిన ఓ వివాహ వేడుకలో అరుదైన ఘటన చోటు చేసుకుంది (Viral Video).

వివాహానికి ముందు వధువు స్నేహితులు వరుడి (Groom)కి కొన్ని కండీషన్లు పెట్టారు. వాటన్నింటినీ పాటిస్తానని వరుడి చేత వెడ్డింగ్ కాంట్రాక్ట్ (Wedding Contract) మీద సంతకం కూడా చేయించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను స్వయంగా వధువు (Bride) కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో వధూవరులు కల్యాణ మండపానికి వెళ్తుండగా ద్వారం వద్ద వధువు స్నేహితురాళ్లు వెడ్డింగ్ కాంట్రాక్ట్ పేపర్ పట్టుకుని నిల్చుని ఉన్నారు. ఆ కాంట్రాక్ట్ మీద సంతకం చేస్తేనే లోపలికి పంపిస్తామని పేర్కొనడంతో వరుడు దానిపై సంతకం చేసేశాడు.

Viral Video: ఇంట్లో పిచ్చి పిచ్చిగా కొట్టుకున్న అత్తాకోడళ్లు, ఆ సమయంలో కొడుకు ఏం చేశాడో తెలిస్తే మాత్రం షాకవడం ఖాయం!

ఇంతకీ ఆ వెడ్డింగ్ కాంట్రాక్ట్‌లో ఏమి ఉందంటే.. ``కాజల్‌ను ఎప్పుడూ సురక్షితంగా ఉంచాలి. ఆమెను బేషరతుగా ప్రేమించాలి``, ``కాజల్ ఎప్పుడూ సరైనదే చేస్తుందని అంగీకరించాలి``, ``సంవత్సరానికి మూడు సార్లు కాజల్‌ను టూర్‌లకు తీసుకెళ్లాలి``, ``కాజల్ సంతోషానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి``, ``ఆమెకు ఎప్పుడూ చలిగా అనిపించకుండా చేయాలి`` అని షరతులు పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2023-07-28T21:12:02+05:30 IST