Viral: ఒకే ఒక్క నిమిషం నిడివి ఉన్న వీడియోతో కరిగిపోయిన నెటిజన్లు.. ఈ వ్యక్తికి రూ.3.50 కోట్లు గిఫ్టుగా ఇచ్చేశారు..!

ABN , First Publish Date - 2023-08-18T16:09:43+05:30 IST

సాధారణంగా ఉద్యోగ జీవితంలో ఏదో ఒక అవసరం కోసం సెలవులు పెట్టడం అనేది కామన్. ఆరోగ్యం బాగా లేకనో, కుటుంబ అవసరాల కోసమే సెలవులు అవసరమవుతాయి. చాలా కొద్ది మాత్రమే అసలు సెలవు అనేదే పెట్టుకుండా ప్రతిరోజూ ఆఫీస్‌కు వెళ్లిపోతారు. అలాంటి వారికి సంస్థ నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి.

Viral: ఒకే ఒక్క నిమిషం నిడివి ఉన్న వీడియోతో కరిగిపోయిన నెటిజన్లు.. ఈ వ్యక్తికి రూ.3.50 కోట్లు గిఫ్టుగా ఇచ్చేశారు..!

సాధారణంగా ఉద్యోగ జీవితంలో ఏదో ఒక అవసరం కోసం సెలవులు పెట్టడం అనేది కామన్. ఆరోగ్యం బాగా లేకనో, కుటుంబ అవసరాల కోసమే సెలవులు అవసరమవుతాయి. చాలా కొద్ది మాత్రమే అసలు సెలవు (Leave) అనేదే పెట్టుకుండా ప్రతిరోజూ ఆఫీస్‌కు వెళ్లిపోతారు. అలాంటి వారికి సంస్థ నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. బర్గర్ కింగ్ సంస్థలో ఓ వ్యక్తి (Burger King employee) అలాగే 27 ఏళ్ల పాటు ఒక్క సెలవు కూడా పెట్టకుండా డ్యూటీకి హాజరయ్యాడు.

అమెరికా (America)లోని లాస్‌వెగాస్‌కు చెందిన బర్గర్‌కింగ్‌ (Burger King) చైన్‌ రెస్టారెంట్‌లో కెవిన్‌ ఫోర్డ్ అనే వ్యక్తి 27సంవత్సరాల పాటు సెలవు తీసుకోకుండా పని చేశాడు. అందుకు ఆ రెస్టారెంట్ యాజమాన్యం అతడికి రివార్డులు (Rewards) ఇస్తామని ప్రకటించింది. అన్నట్టుగానే అతడికి ఓ గిఫ్ట్ కవర్ ఇచ్చింది. అయితే అందులో సినిమా టికెట్లు, స్వీట్లు, పెన్నులు, కీచైన్‌లు, స్టార్‌బక్స్ కప్పులు కనిపించాయి. ఆ విషయాన్ని టిక్‌టాక్ వీడియో ద్వారా కెవిన్ బయటపెడ్డాయి. అంత అంకితభావంతో పని చేస్తే అంత చవక బహుమతులు ఇస్తారా అని నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు.

Emergency Alert: నిన్న మధ్యాహ్నం సమయంలో మీ ఫోన్‌కు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చిందా..? దీని అర్థమేంటంటే..!

కెవిన్ కూతురు సెరీనా తండ్రి క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం ద‌క్క‌లేద‌ని వాపోతూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం చెప్పింది. త‌న తండ్రికి నిజంగా ద‌క్కాల్సిన గౌర‌వం, పేరుప్ర‌ఖ్యాతుల కోసం ఆమె ``గోఫండ్‌ మి`` (GoFundMe) అనే క్యాంపెయిన్ లాంఛ్ చేసింది. ఈ క్యాంపెయిన్‌కు అనూహ్య స్పందన లభించింది. అనేక వర్గాల ప్రజల నుంచి విరాళాలుగా ఏకంగా 4ల‌క్ష‌ల డాల‌ర్లు పైగా (రూ. 3.48 కోట్లు) విరాళాలు సమకూరాయి. దీంతో కెవిన్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.

Updated Date - 2023-08-18T16:09:43+05:30 IST