Ex boyfriend: మాజీ ప్రియుడికి ప్రేయసి షాక్...పెళ్లి సందర్భంగా ఏం చేసిందంటే...

ABN , First Publish Date - 2023-04-25T08:14:53+05:30 IST

మాజీ ప్రియుడికి ప్రియురాలు బిగ్ షాక్ ఇచ్చిన ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది....

Ex boyfriend: మాజీ ప్రియుడికి ప్రేయసి షాక్...పెళ్లి సందర్భంగా ఏం చేసిందంటే...
woman throws acid at Ex boyfriend

బస్తర్ (ఛత్తీస్‌గఢ్‌): మాజీ ప్రియుడికి ప్రియురాలు బిగ్ షాక్ ఇచ్చిన ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది.(Ex boyfriend) ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రంలోని ఛోటే అమాబల్ గ్రామంలో వరుడు దమ్రుధర్ బాఘేల్ (25) ఓ యువతిని ప్రేమించాడు.దమ్రుధర్ బాఘేల్ పెళ్లి చేసుకుంటానని చెప్పి కొన్నేళ్లు ప్రేయసితో సంబంధం పెట్టుకొని అనంతరం ఆమెను వదిలి మరో 19 ఏళ్ల యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు.

ప్రియుడి పెళ్లి విషయం తెలిసి ప్రియురాలు దమ్రుధర్ కు ఫోన్ చేసినా ఆమె ఫోన్ కాల్ ఎత్తలేదు. టీవీలో వస్తున్న ‘క్రైమ్ పెట్రోల్’ సీరియల్ చూసిన ప్రియురాలు తనను మోసం చేసిన దమ్రుధర్ పై యాసిడ్ దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియురాలైన యువతి మిరప పొలంలో డ్రిప్ పరికరాలను శుభ్రం చేసేందుకు తెచ్చిన యాసిడ్ బాటిల్ తీసుకొని ఛోటే అమాబల్ గ్రామంలోని పెళ్లి మండపానికి మారువేషం సూటు,బూటు వేసుకొని వచ్చి వరుడిపై యాసిడ్ పోసింది.(woman throws acid)

ఇది కూడా చదవండి: Gangster Bahubali leader: ఆనంద్ మోహన్ 14 ఏళ్ల తర్వాత జైలు విడుదల...బీహార్ సర్కారు ఉత్తర్వులు

పెళ్లి(wedding) మండపంలో జరిగిన యాసిడ్ దాడిలో వరుడు, వధువు, పెళ్లికి వచ్చిన 10 మంది అతిథులు గాయపడ్డారు. పెళ్లి మండపంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు మారువేషంలో వచ్చి యాసిడ్ పోసి పరారవుతున్న యువతిని పట్టుకొని అరెస్టు చేశారు. నిందితురాలైన మాజీ ప్రేయసిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 326 ఎ కింద కేసు నమోదు చేశారు. విచారణలో వరుడి మాజీ ప్రేయసి అయిన ఒక యువతి ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది.

Updated Date - 2023-04-25T08:14:53+05:30 IST