Viral Video: పెట్రోల్ బంకు ముందు ఆగి ఉన్న కారు.. అందరూ చూస్తుండగానే.. సుత్తితో అద్దాలను పగలగొట్టడం వెనుక..!

ABN , First Publish Date - 2023-07-26T16:25:37+05:30 IST

చిన్న పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారిని కారులో బయటకు తీసుకెళ్లినపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా లాక్ అయిన కార్లలో ఉండిపోయి ప్రాణాలు కోల్పోయిన పిల్లల గురించి ఇటీవలి కాలంలో ఎక్కువ వార్తలు వస్తున్నాయి.

Viral Video: పెట్రోల్ బంకు ముందు ఆగి ఉన్న కారు.. అందరూ చూస్తుండగానే.. సుత్తితో అద్దాలను పగలగొట్టడం వెనుక..!

చిన్న పిల్లల (Children) విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారిని కారు (Car)లో బయటకు తీసుకెళ్లినపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. లాక్ అయిన కార్లలో ఉండిపోయి ప్రాణాలు కోల్పోయిన పిల్లల గురించి ఇటీవలి కాలంలో ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ తండ్రి కారు అద్దం పగలగొట్టి మరీ తన కొడుకును కాపాడుకున్నాడు (Child was left locked in the car).

foosgonewild అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో (Viral Video)లో ఓ పెట్రోల్ బంకు ముందు ఓ కారు పార్క్ చేసి ఉంది. ఆ కారు ముందు అద్దాన్ని ఇనుప రాడ్డులతో పగలగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. అద్దం పగిలిన తర్వాత లోపలి నుంచి కారును అన్ లాక్ చేయడంతో ఓ చిన్నారి బయటకు వచ్చాడు. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ ఘటన జరిగింది. ఆ ఘటన జరిగిన రోజు టెక్సాస్‌ (Texas)లో ఉష్ణోగ్రత అత్యంత తీవ్రంగా ఉంది. తల్లిదండ్రులతో కలిసి ఓ చిన్నారి షాపింగ్ కోసం బయటకు వచ్చాడు.

Viral: వామ్మో.. ఇదేం రాక్షస ప్రేమ తల్లీ.. ప్రియుడు ఎక్కడ దక్కకుండా పోతాడేమోనని రూ.5 కోట్లు కొట్టేసింది..!

కారు తాళం తీయకుండా తల్లిదండ్రులు దిగిపోయారు. వెనుక సీటులో ఉన్న చిన్నారిని బయటకు తీసే లోపు కారు డోర్లు ఆటోమేటిక్‌గా లాక్ అయిపోయాయి. వేడి విపరీతంగా ఉండడంతో కారులో ఉన్న చిన్నారి గుక్క పెట్టి ఏడ్చాడు. చివరకు అద్దం బద్దలుగొట్టి ఆ బాలుడిని బయటకు తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 73 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు.

Updated Date - 2023-07-26T16:25:37+05:30 IST