Viral Video: ట్యాలెంట్ అంటే ఇదీ.. చెత్తతో ``సూపర్ గాడిద``ను తయారు చేసిన చైనా ఇంజినీర్.. వైరల్ అవుతున్న వీడియో!
ABN , First Publish Date - 2023-08-12T16:38:21+05:30 IST
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సామాన్యుల ప్రతిభ చాలా మందిని చేరుతోంది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో నూతన ఆవిష్కరణలు చేస్తున్న వారి ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఎంతో మంది సామాన్యులు తమ ఇంజినీరింగ్ ప్రతిభను బయటపెట్టి నెటిజన్ల ప్రశంసలు అందుకున్నారు.
సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చాక సామాన్యుల ప్రతిభ (Talent) చాలా మందిని చేరుతోంది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో నూతన ఆవిష్కరణలు (New Innovations) చేస్తున్న వారి ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఎంతో మంది సామాన్యులు తమ ఇంజినీరింగ్ ప్రతిభను బయటపెట్టి నెటిజన్ల ప్రశంసలు అందుకున్నారు. తాజాగా చైనా (China)కు చెందిన ఓ ఇంజినీర్ (Engineer) తన గ్యారేజ్‌లోని పనికిరాని వస్తువులతో ఆరు చక్రాల విచిత్ర వాహనాన్ని తయారు చేశాడు. ఆ వాహనం నడిచే తీరు చాలా వింతగా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది.
ట్విటర్ యూజర్ @TansuYegen ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి ఓ విచిత్ర వాహనంపై కూర్చుని ఉన్నాడు. ఆ వాహనానికి నాలుగు కాళ్ల మాదరిగా నాలుగు రాడ్లు ఉన్నాయి. మధ్యలో రెండు చిన్న చిన్న టైర్లలాంటివి ఉన్నాయి. దానికి హ్యాండిల్, సీటు కూడా ఉన్నాయి. స్టార్ట్ చేయగానే ఆ వాహనం చాలా విచిత్రంగా ముందుకు కదులుతోంది. ఆ నడిచే తీరు గాడిదను పోలి ఉంది. దాంతో నెటిజన్లు దానిని ``సూపర్ గాడిద``గా (Mechanical Donkey) అభివర్ణిస్తున్నారు.
Crime: బాబోయ్.. ఇలాంటి కూతురు ఎవరికీ ఉండకూడదు.. ప్రియుడి కోసం యువతి మాస్టర్ ప్లాన్.. తండ్రిని కారులో రమ్మని చెప్పి..
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)గా మారింది. ఐదు లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 7 వేల మంది లైక్ చేశారు. కొందరు ఈ వాహన తయారీదారుణ్ని మెచ్చుకున్నారు. దానికి మెకానికల్ గాడద అంటూ పేరు పెట్టారు. ఈ వాహనాన్ని ఉపయోగిస్తే 5 నిమిషాల్లో వెళ్లాల్సిన దూరానికి 50 నిమిషాలు పడుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.