నెలకు రూ.4 లక్షల జీతం.. ఏడాదిలో 6 నెలల పాటే పని.. విహారయాత్రల ఖర్చు కూడా సంస్థదేనట..!

ABN , First Publish Date - 2023-02-22T18:30:24+05:30 IST

నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడొస్తాయా? అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అదే పనిగా ఉద్యోగం కోసమే చదివే వారుంటారు. కోచింగ్‌లు, ట్రైనింగ్‌లు

నెలకు రూ.4 లక్షల జీతం.. ఏడాదిలో 6 నెలల పాటే పని.. విహారయాత్రల ఖర్చు కూడా సంస్థదేనట..!
కోట్లు వెనకేసుకునే ఛాన్స్.

నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడొస్తాయా? అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అదే పనిగా ఉద్యోగం కోసమే చదివే వారుంటారు. కోచింగ్‌లు, ట్రైనింగ్‌లు తీసుకుంటూ ఉంటారు. ఉద్యోగ ప్రకటన రావడమే ఆలస్యం.. వెంటనే అప్లై చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తూ ఉంటాం. అంతెందుకు ఇటీవల కానిస్టేబుల్ పోస్టులకు పాకిస్థాన్‌లో ఎంత మంది యువకులు వచ్చారో చూశాం. ఏకంగా స్టేడియాలు నిండిపోయి.. కిలోమీటర్ల కొద్ది బారులు తీరారు. ప్రభుత్వ ఉద్యోగానికి అంత డిమాండ్ ఉంటుంది. ఇంకొందరు ఏదో ఒక ఉద్యోగం వచ్చి, జీతం భారీగా ఉంటే చాలనుకుంటారు. ఇలా రెండు రకాలైన నిరుద్యోగులు ఉంటారు. అయితే ఓ కన్సల్టెంట్ సంస్థ జాబ్ ప్రకటన చేసినా ఎవరూ ముందుకు రావడం లేదు. జీతమేదో తక్కువనుకుంటే పొరబాటు.. లక్షల్లో జీతం. భారీ ప్రయోజనాలు అయినా కూడా ఒక్క దరఖాస్తు కూడా రాలేదంట. ఇంతకీ ఆ పోస్టేంటి? ఎక్కడ? ఏంటి? ఎందుకు అప్లై చేయలేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.

నెలకు రూ.4 లక్షల జీతం (salary). విహారయాత్రల ఖర్చు కంపెనీదే (company). ఉద్యోగ భద్రత, సంస్థను వీడే ముందు భారీ ప్రయోజనాలు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇలాంటి ఉద్యోగాన్ని ఎవరైనా వదులుకుంటారా? కానీ ఉద్యోగంలో చేరడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఈ వింత పరిస్థితి స్కాట్‌లాండ్‌లో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: రాజభోగం అంటే ఇతడిదే.. ఇంట్లో ఖాళీగా ఉంటోంటే.. భార్యలే ఉద్యోగాలు చేసి భర్తను పోషిస్తున్నారు..!

స్కాట్లాండ్(Scotland)లోని అబెర్డీన్ తీరంలో ఒక కన్సల్టెంట్ సంస్థ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. అవి ఆఫ్‌షోర్ రిగ్గర్ పోస్టులు.. మొత్తం ఐదు ఖాళీల భర్తీకి ప్రకటన జారీ చేసింది. సంవత్సరానికి 6 నెలల పాటు రోజుకు 12 గంటలు విధులు నిర్వర్తించాలి. ఉద్యోగి (employees) అక్కడే రెండేళ్ల పాటు ఉండాలని నిర్ణయించుకుంటే ఉద్యోగం వీడే ముందు కోటి రూపాయల ప్రయోజనం కూడా దక్కనుంది. ఇంత భారీ మొత్తంలో ప్రయోజనం పొందవచ్చని తెలిసినా అభ్యర్థులెవరూ అప్లై చేయలేదు. దీంతో ఉద్యోగులు దొరక్క సంస్థ తల పట్టుకుంటోంది. చివరకు చమురు సంస్థలో చేరేందుకు మక్కువ చూపించడం లేదని గ్రహించింది. ఈ ఉద్యోగం యొక్క ప్రత్యేకత ఏంటంటే.. సముద్రం అడుగున భూమి పొరల్లోని చమురును వెలికితీయాలి. అందుకోసమే ఎవరూ ముందుకు రావడం లేదని ఆ సంస్థ అభిప్రాయపడింది.

ఇది కూడా చదవండి: 24 ఏళ్ల కుర్రాడు.. బరువు 240 కేజీలు.. కేవలం 2 నెలల్లోనే 70 కిలోలు తగ్గిపోయాడు.. అసలు ఈ వింత ఎలా సాధ్యమైందంటే..

Updated Date - 2023-02-22T19:07:44+05:30 IST