Covid-19: కోవిడ్ ఏ ల్యాబ్ నుంచి లీక్ అయిందంటే...యూఎస్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ సంచలన నివేదిక
ABN , First Publish Date - 2023-02-27T08:53:07+05:30 IST
కోవిడ్-19 మహమ్మారి చైనా ప్రయోగశాల నుంచి ఉద్భవించిందా?అంటే అవును వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని అమెరికా ఎత్తి చూపిస్తోంది...
వాషింగ్టన్ :కోవిడ్-19 మహమ్మారి చైనా ప్రయోగశాల నుంచి ఉద్భవించిందా?అంటే అవును వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని అమెరికా ఎత్తి చూపిస్తోంది. కోవిడ్ మహమ్మారి(Covid-19) ఏ ల్యాబ్ నుంచి లీక్ అయిందనే విషయంపై అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్(US Energy Department) తాజాగా విడుదల చేసిన సంచలన నివేదికలో వెల్లడించింది.ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబొరేటరీ(Wuhan Institute of Virology) నుంచి పుట్టి ఉండొచ్చని అమెరికా ఇంధన శాఖ తన తాజా నివేదికలో పేర్కొంది.(Chinese lab leak)
ఇది కూడా చదవండి : Delhi: ఢిల్లీలో దారుణం...వీధికుక్కపై ఆగంతకుడు ఏం చేశాడంటే...
ఇంతకుముందు కూడా వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ గురించి వార్తలు వెలువడ్డాయి. అయినప్పటికీ చైనా అధికారులు దానిని ఎప్పుడూ ధృవీకరించలేదు.ఎనర్జీ డిపార్ట్‌మెంట్ గతంలో కరోనా వైరస్ యొక్క మూలం గురించి ఖచ్చితంగా వెల్లడించలేదు.తాజా పరిశోధనల్లో వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ ఉద్భవించిందని యూఎస్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ తేల్చిచెప్పింది. యూఎస్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన నివేదికను ఇటీవల వైట్ హౌస్, కాంగ్రెస్ ముఖ్య సభ్యులకు క్లాసిఫైడ్ ఇంటెలిజెన్స్ విభాగానికి అందించారు.
ఇది కూడా చదవండి : Assembly polls: మేఘాలయ, నాగాలాండ్‌లలో పోలింగ్ ప్రారంభం
కోవిడ్ -19 వైరస్ చైనీస్ లేబొరేటరీలో జరిగిన ప్రమాదం ద్వారా వ్యాపించిందని చెప్పారు. జాతీయ ఇంటెలిజెన్స్ ప్యానెల్‌తో పాటు మరో నాలుగు ఏజెన్సీలు ఇప్పటికీ ఇది సహజ ప్రసారం వల్ల జరిగినట్లు నిర్ధారించాయి.ఇంతకుముందు కూడా 2021లో చైనాలో ల్యాబ్ లీక్ కారణంగా కరోనావైరస్ మహమ్మారి సంభవించిందని ఎఫ్‌బీఐ నిర్ధారించింది.