Crime News: ఇంటిని శుభ్రం చేస్తుండగా బెడ్రూంలో బయటపడిన సీక్రెట్ కెమెరా.. అసలు దాన్ని ఎవరు పెట్టారో తెలిసి అంతా షాక్.. చివరకు..!

ABN , First Publish Date - 2023-05-16T13:49:02+05:30 IST

ఓ మహిళ తన పడక గది క్లీన్ చేస్తుండగా ఆమెకు సీక్రెట్ కెమెరా దొరికింది. దానివెనుక నిజం తెలిసిన తరువాత విస్తుపోవడం ఆమె వంతయింది..

Crime News: ఇంటిని శుభ్రం చేస్తుండగా బెడ్రూంలో బయటపడిన సీక్రెట్ కెమెరా.. అసలు దాన్ని ఎవరు పెట్టారో తెలిసి అంతా షాక్.. చివరకు..!

ఈమధ్య కాలంలో మనుషుల మీద నిఘా ఎక్కువయ్యింది. ఒకప్పుడు పెద్ద పెద్ద షాప్స్ లోనూ, మాల్స్ లోనూ ఉపయోగించే సీక్రెట్ కెమెరాలు సాధారణ పౌరుల జీవితాల్లోకి కూడా చొచ్చుకు వచ్చేశాయి. కొడుకు చదువుతున్నాడో లేదో అని ఓ తండ్రి కెమెరా పెడితే.. ఇంట్లో సెక్యూరిటీ కోసం మరొకరు, ఒకరిమీద మరొకరికి ఉన్న అనుమానంతో భార్యాభర్తలు.. ఇలా సీక్రెట్ గా మనుషుల కదలికల మీద నిఘా పెట్టడం సర్వసాధారణం అయిపోయింది. ఓ మహిళ తన పడక గది(bed room) క్లీన్ చేస్తుండగా ఆమెకు సీక్రెట్ కెమెరా దొరికింది(women found secret camera in bedroom). అది ఎవరు పెట్టారో.. ఏంటో ఆమెకు అర్థం కాలేదు. కానీ నిజం తెలిసిన తరువాత విస్తుపోవడం ఆమె వంతయింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

హర్యానా(Haryana) రాష్ట్రం గురుగ్రామ్(Gurugram) లో నివసిస్తున్న ఓ 30ఏళ్ళ మహిళ నివసిస్తోంది. ఆమె పడకగది క్లీన్ చేస్తోంటే గదిలో ఆమెకు రహస్య కెమెరా(secret camera) దొరికింది. దాన్ని చూడగానే ఆమె మైండ్ బ్లాకయ్యింది. ఆ కెమెరాను ఎవరు పెట్టారో ఆమెకు మొదట అర్థం కాలేదు. బాగా ఆలోచించిన తరువాత కొద్దికాలం క్రితం తన ఇంట్లో పనికి చేరిన వ్యక్తి గుర్తొచ్చాడు.ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం కౌశాంబిలో నివసిస్తున్న శుభం కుమార్ అనే వ్యక్తిని సదరు మహిళ ప్లేస్ మెంట్ ఏజెన్సీ(placement agencie) ద్వారా పనిలో చేర్చుకుంది. మొదట్లో అతను కొన్నాళ్ళు ఆమె ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడే అతను తన పడకగదిలో సీక్రెట్ కెమెరా అమర్చి ఉంటాడని సదరు మహిళ భావించింది. ఆమె వెంటనే ఏజెన్సీ వారికి ఫిర్యాదు చేసి అతన్ని పనిలో నుండి తొలగించింది.

Viral Video: అమ్మబాబోయ్.. వీడికెంత ధైర్యం.. 12 అడుగుల పొడవున్న కోబ్రాను చేత్తో పట్టుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నిస్తోంటే..!


మహిళ శుభం కుమార్ ను పనిలో నుండి తొలగించిన తరువాత ఆమెకు వాట్సాప్ లో గుర్తుతెలియని నెంబర్ నుండి కొన్ని వీడియోస్ వచ్చాయి. అవన్నీ ఆ మహిళ పడకగదిలో దుస్తులు మార్చుకుంటున్నప్పుడు, ఇతర అభ్యంతకరమైన సమయాల్లో రికార్డైనవి(offensive videos). ఆ వీడియోలు పంపిన వ్యక్తి ఆమెతో '2లక్షల రూపాయలు ఇవ్వకుంటే ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను'అని బెదిరించాడు. అతనే ఆ పని చేస్తున్నాడని అర్థం చేసుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది.సైబర్ క్రైమ్ బ్రాంచ్(cyber crime branch) వారు మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద దర్యాప్తు ప్రారంభించినట్టు వారు తెలిపారు. కాగా ఇలాంటివాళ్ళతో జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసు అధికారులు అందరినీ హెచ్చరిస్తున్నారు.

పేస్టు.. టూత్ బ్రష్ ఎక్కడ పెడుతుంటారు? బాత్రూమ్ లోనా? బయటా? తెలియకుండానే ఎంత పెద్ద తప్పు చేసేస్తున్నారో..


Updated Date - 2023-05-16T20:38:17+05:30 IST