ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రి టెర్రస్ పైకి వెళ్లిన కూతురు.. చదువుకుంటోందనుకున్న తల్లిదండ్రులు.. కాసేపటికి వెళ్లి చూస్తే..
ABN , First Publish Date - 2023-02-05T17:13:28+05:30 IST
బాలికలు చిన్న చిన్న విషయాలను కూడా చాలా సీరియస్‌గా తీసుకుంటుంటారు. ఇంట్లో తల్లిదండ్రులు తిట్టినా, స్కూల్లో టీచర్లు మందలించినా, ప్రేమలో మోసపోయినా.. చివరకు ఊహించని నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఉత్తరప్రదేశ్‌లో
బాలికలు చిన్న చిన్న విషయాలను కూడా చాలా సీరియస్‌గా తీసుకుంటుంటారు. ఇంట్లో తల్లిదండ్రులు తిట్టినా, స్కూల్లో టీచర్లు మందలించినా, ప్రేమలో మోసపోయినా.. చివరకు ఊహించని నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రి ఇంటి టెర్రస్ పైకి వెళ్లింది. చదువుకుంటోందని తల్లిదండ్రులు అనుకున్నారు. అయితే కాసేపటికి పైనుంచి శబ్ధాలు రావడంతో కంగారుపడ్డారు. కంగారుగా వెళ్లి చూసి, చివరకు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బండా పరిధికి చెందిన దంపతులకు 16ఏళ్ల కుమార్తె ఉంది. రోజూ ఎంతో ఆనందంగా ఉండే బాలిక.. శనివారం మాత్రం సైలెంట్‌గా కనిపించింది. ఇంట్లో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. శనివారం అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంటి టెర్రస్ పైకి వెళ్లింది. గమనించిన తల్లిదండ్రులు చదువుకోవడానికి వెళ్లిందేమో అనుకున్నారు. అయితే ఆమె వెళ్లిన కొద్ది సేపటికి పైనుంచి బుల్లెట్ శబ్ధాలు (Gun firing) రావడంతో అంతా కంగారుపడ్డారు. ఏం జరుగుతుందో అర్థం కాక.. పరుగెత్తుకుంటూ పైకి వెళ్లారు. తుపాకీ కాల్చుకుని, రక్తపు మడుగులో పడి ఉన్న కూతురిని చూసి బోరున విలపించారు.
ఎవరికీ డౌట్ రాకూడదని భార్యను పూడ్చిన చోటే మొక్కల్ని కూడా నాటిన భర్త.. 30 కిలోల ఉప్పుతో..
చికిత్స నిమిత్తం వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలిక మృతి (girl died) చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్నపోలీసులు అక్కడికి చేరుకుని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, బాలిక మృతిపై స్థానికులను విచారించారు. కొన్ని రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని పలువురు తెలిపారు. ఇంట్లో గొడవల కారణంగానే ఆత్మహత్య చేసుకుందా... లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.