నీతో కాపురం చేయను.. పిల్లల్ని కూడా కనను.. పెళ్లయిన మర్నాడే భార్య మాటలు విని అవాక్కైన భర్త.. అసలు కథేంటంటే..
ABN , First Publish Date - 2023-02-14T16:10:12+05:30 IST
దుస్తుల వ్యాపారం చేసే అతను ఆర్థికంగా ఎంతో స్థితిమంతుడు. ఇటీవలే ఓ యువతిని ఘనంగా వివాహం చేసుకున్నాడు. అనంతరం హనీమూన్ కూడా అంతే గ్రాండ్‌గా ప్లాన్ చేశాడు. ఆనందంగా హనీమూన్‌కు వెళ్లిన అతడు.. అంతలోనే ఊహించని వార్త విన్నాడు. వివాహమైన మర్నాడే..
దుస్తుల వ్యాపారం చేసే అతను ఆర్థికంగా ఎంతో స్థితిమంతుడు. ఇటీవలే ఓ యువతిని ఘనంగా వివాహం చేసుకున్నాడు. అనంతరం హనీమూన్ కూడా అంతే గ్రాండ్‌గా ప్లాన్ చేశాడు. ఆనందంగా హనీమూన్‌కు వెళ్లిన అతడు.. అంతలోనే ఊహించని వార్త విన్నాడు. వివాహమైన మర్నాడే భార్య వద్దకు వెళ్లిన అతడికి భార్య ఊహించని షాక్ ఇచ్చింది. ‘‘నీతో కాపురం చేయను, పిల్లల్ని కూడా కనను’’.. అని భార్య చెప్పడంతో అవాక్కయ్యాడు. చివరకు ఏం జరిగిందంటే..
గుజరాత్‌లోని (Gujarat) సూరత్ పరిధికి చెందిన ఓ వ్యక్తి.. క్లాత్ మార్కెట్ (Clothing business) నిర్వహిస్తుంటాడు. ఇతడు ఇటీవల ఓ యువతిని వివాహం (marriage) చేసుకున్నాడు. అతడు ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో వివాహం చాలా ఘనంగా జరిగింది. వివాహానంతరం హనీమూన్‌ను (Honeymoon) కూడా చాలా రిచ్‌గా ప్లాన్ చేశాడు. అయితే వివాహమైన మరుసటి రోజే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అతడు ఊహించలేకపోయాడు. వివాహానంతరం హనీమూన్‌లో ఉండగా భార్య వద్దకు వచ్చిన భర్తకు ఆమె షాక్ ఇచ్చింది. నేను గతంలోనే ఓ యువకుడిని ప్రేమించాను, నీతో కాపురం చేయలేను, పిల్లల్ని కూడా కనను’’.. అని చెప్పడంతో ఒక్కసారిగా అతను షాక్ అయ్యాడు.
పెళ్లికి ముందే ప్రేమలో (love) ఉన్న ఆమె.. పెద్దల బలవంతం మీద దుస్తుల వ్యాపారిని చేసుకోవాల్సి వచ్చిందని తెలిసింది. ఈ ఘటనతో దంపతుల మధ్య గొడవలు (quarrels) మొదలయ్యాయి. ఎంత చెప్పినా భార్య వినకపోవడంతో చివరకు.. విడాకుల (Divorce) కోసం కోర్టును ఆశ్రయించాడు. దీంతో తనకు భరణం కావాలంటూ భార్య విన్నించుకుంది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. భార్య ఇంకో వివాహం చేసుకునే వరకూ భర్త అన్ని ఖర్చులనూ భరించాల్సి ఉంటుందని తీర్పు ఇచ్చింది. మొత్తానికి ఈ ఘటణ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Viral Video: బలవంతం చేయగా బయటకు కక్కేసిన పాము.. చివరకు అది మింగిన వస్తువును చూసి అంతా షాక్...