Viral Video: మీరు మంచూరియా తింటుంటారా? దానిని ఎలా తయారు చేస్తున్నారో చూస్తే భయపడతారేమో!
ABN , First Publish Date - 2023-10-07T19:17:55+05:30 IST
చైనీస్ ఫుడ్ అయిన మంచూరియా అంటే చాలా మంది ఇష్టపడతారు. వెజ్, నాన్-వెజ్ వంటలతో కలిపి అమ్మే మంచూరియాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మంచూరియాను డ్రైగా తిన్నా, గ్రేవీతో కలిపి తిన్నా దాని టేస్ట్‌కు దాసోహం అవకతప్పదు. నిజానికి మంచూరియాను ఇంట్లోనే తయారు చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు.
చైనీస్ ఫుడ్ (Chinese Food) అయిన మంచూరియా (Manchuria) అంటే చాలా మంది ఇష్టపడతారు. వెజ్, నాన్-వెజ్ వంటలతో కలిపి అమ్మే మంచూరియాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మంచూరియాను డ్రైగా తిన్నా, గ్రేవీతో కలిపి తిన్నా దాని టేస్ట్‌కు దాసోహం అవకతప్పదు. నిజానికి మంచూరియాను ఇంట్లోనే తయారు చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయ, సెనగ పిండి, ఉప్పు, నూనె వంటి పదార్థాలను ఉపయోగించి దీన్ని సులభంగా వండవచ్చు. అయినా చాలా మంది రోడ్డు పక్కన స్టాల్స్ దగ్గర తినేందుకే ఇష్టపడతారు (Manchuria making Video).
రోడ్డు పక్కన స్టాల్స్‌పై లభించే మంచూరియా టేస్టీగా ఉన్నప్పటికీ, దానిని ఎలా తయారు చేస్తారో ఒక్కసారైనా ఆలోచించారా? మంచూరియా తయారీ విధానంలో పాటించే శుభ్రత గురించి పట్టించుకున్నారా? ఇటీవలి కాలంలో ఫ్యాక్టరీలలో తయారయ్యే చిరుతిళ్ల గురించిన రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సూరత్‌లోని ఓ ఫ్యాక్టరీలో 500 కేజీల మంచూరియాను తయారు చేస్తుండగా తీసిన వీడియో బాగా వైరల్ అవుతోంది. క్యాబేజీలను కట్ చేయడం దగ్గర్నుంచి, పిండి కలపడం, వేయించడం వరకు ఎక్కడా పరిశుభ్రత పాటించలేదు (unhygienic).
Shocking Video: ఓరి దేవుడో.. ఇదేం చట్నీ..? బొగ్గులతో మంటను చేసి వెరైటీ రెసిపీ.. తిన్న వాళ్లందరికీ రోగాలు రావడం ఖాయం..!
మంచూరియను తయారు చేసే కార్మికులు ఎవరూ చేతులకు గ్లౌస్ ధరించలేదు. వారు అన్ని పనులను ఒట్టి చేతులతోనే చేసేస్తున్నారు. ఈ వీడియో the beardedfoodie అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయింది. ``మీకు మంచూరియా అంటే ఇష్టమైతే ఈ వీడియో చూడొద్ద``ని కామెంట్ కూడా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పరిశుభ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.