Viral Video: ఏడుస్తూ కూర్చున్న రైతు.. దగ్గరకు వెళ్లి ఓదార్చినా పట్టించుకోవడం లేదని ఈ కుక్కలు ఏం చేశాయో చూస్తే..!
ABN , First Publish Date - 2023-07-12T14:50:41+05:30 IST
మనషులకు, ఇతర జంతువులకు మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. ఎన్నో వందల ఏళ్లుగా మనుషులతోపాటు ఇతర జంతువులు కూడా ఈ భూమి మీద కలిసి మనుగడ సాగిస్తున్నాయి. ముఖ్యంగా కుక్కలు, ఆవులు వంటి జంతువులు తమ యజమానుల పట్ల చూపించే ప్రేమ, విశ్వాసం అతి స్వచ్ఛంగా ఉంటాయి.
మనషులకు, ఇతర జంతువులకు మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. ఎన్నో వందల ఏళ్లుగా మనుషులతోపాటు ఇతర జంతువులు కూడా ఈ భూమి మీద కలిసి మనుగడ సాగిస్తున్నాయి. ముఖ్యంగా కుక్కలు (Dogs), ఆవులు (Cows) వంటి జంతువులు మనుషులతో మరింతగా మమేకమయ్యాయి. తమ యజమానుల పట్ల అవి చూపించే ప్రేమ, విశ్వాసం అతి స్వచ్ఛంగా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది (Heartwarming video ).
@TansuYegen అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక రైతు (Farmer)తన పొలంలో దిగాలుగా కూర్చున్నాడు. అతడి దగ్గరకు రెండు కుక్కలు వచ్చి అతడిని నవ్వించడానికి ప్రయత్నించాయి. అయినా అతడు వాటిని పట్టించుకోలేదు. దీంతో ఆ రెండు కుక్కలు వెళ్లిపోయి ఆవులను తీసుకొచ్చాయి (Dogs seeks cows help). ఆ ఆవులు అతడిని ముందుకు, వెనక్కి తోసి నవ్వించడానికి ప్రయత్నించాయి. అతడిని ఆప్యాయంగా కౌగిలించుకున్నాయి. దీంతో ఆ రైతు మామూలు మనిషయ్యాడు.
Gympie: బాబోయ్.. ఇదేం వింత మొక్క.. ముట్టుకుంటే చాలు.. చనిపోవాలని అనిపిస్తుందట..!
తమ యజమాని పట్ల కుక్కలు, ఆవులు ప్రదర్శించిన అపారమైన ప్రేమ, కరుణ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియో (Viral Video)ను ఇప్పటివరకు దాదాపు 20 లక్షల మంది వీక్షించారు. ఎంతో మంది ఈ వీడియోపై ఎమోషనల్ కామెంట్లు చేశారు. ``ఈ రోజు నేను చూసిన అత్యుత్తమ దృశ్యం అది. ప్రేమ, కరుణ అన్ని జాతులలోనూ ఉంది``, ``ఎంత అందంగా ఉంది``, ``ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడు.. అతడికి నిజమైన సన్నిహితులు దొరికారు`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.