Viral Video: మందుబాబా మజాకానా.. వరాహంపై అతడి స్వారీ మామూలుగా లేదుగా..!

ABN , First Publish Date - 2023-07-11T16:10:27+05:30 IST

మందుబాబులు తాగిన మైకంలో ఏం చేస్తారో వారికే తెలియదు. మద్యం మత్తులో వారు చేసే పనులు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతాయి. చాలా సార్లు ఫన్నీగా ఉండి నవ్వు తెప్పిస్తాయి. మందు బాబులు చేసే ఫన్నీ ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే చాలా సార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Viral Video: మందుబాబా మజాకానా.. వరాహంపై అతడి స్వారీ మామూలుగా లేదుగా..!

మందుబాబులు (Drunken man) తాగిన మైకంలో ఏం చేస్తారో వారికే తెలియదు. మద్యం మత్తులో వారు చేసే పనులు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతాయి. చాలా సార్లు ఫన్నీగా ఉండి నవ్వు తెప్పిస్తాయి. మందు బాబులు చేసే ఫన్నీ ఘటనలకు సంబంధించిన వీడియోలు (Drunken man Videos) ఇప్పటికే చాలా సార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు (Funny Videos).

@DrunkDoingShit అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పందుల గుంపు ఉంది. అక్కడకు ఓ మందు బాబు వచ్చాడు. అక్కడ భారీగా ఉన్న ఓ పంది (Pig) మీదకు ఎక్కి కూర్చున్నాడు. భయపడిన ఆ పంది అతడిని కింద పడేసేందుకు ప్రయత్నించింది. వేగంగా చుట్టూ తిరిగింది. అయినా ఆ మందుబాబు కింద పడలేదు. దీంతో వేగంగా ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. ఆ పందిని గట్టిగా పట్టుకున్న మందు బాబు మాత్రం కింద పడలేదు.

Viral: మా పెళ్లికి రావాలనుకుంటే అలాంటి బహుమతులు తీసుకురండి.. వధువు వింత కండిషన్..

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 12 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. ``బాగా మత్తులో ఉన్నాడు``, ``ఆ పందిని గుర్రం అనుకుంటున్నాడేమో``, ``మత్తులో ఉన్నా కింద పడకుండా గట్టిగా పట్టుకున్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-11T16:10:27+05:30 IST