Dry Fruits: వేయించిన డ్రై ఫ్రూట్స్ తింటుంటారా? వీటి గురించి ఈ నిజాలు తెలుసా?

ABN , First Publish Date - 2023-10-12T16:09:15+05:30 IST

సాధారణ డ్రై ఫ్రూట్స్ కంటే వేయించిన డ్రై ఫ్రూట్స్ తినడం చాలామందికి ఇష్టం. అసలు డ్రై ఫ్రూట్స్ ను వేయించి తినడం మంచిదేనా?

Dry Fruits: వేయించిన డ్రై ఫ్రూట్స్ తింటుంటారా? వీటి గురించి ఈ నిజాలు తెలుసా?

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతోమంచివి. రోజూ ఓ గుప్పెడు డ్రైఫ్రూట్స్ తింటే శరీరానికి కావసిన పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా అందుతాయని చెబుతారు. ఇవి ఎక్కువ శక్తిని ఇవ్వడం వలన రోజులో సరిపడినంత ఆహారం తినని వారు డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. సాధారణ డ్రై ఫ్రూట్స్ కంటే వేయించిన డ్రై ఫ్రూట్స్ తినడం చాలామందికి ఇష్టం. అసలు డ్రై ఫ్రూట్స్ ను వేయించి తినడం మంచిదేనా? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

బాదం, వాల్ నట్, జీడిపప్పు, పిస్తా వంటి నట్స్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిల నుండి కొలెస్ట్రాల్ నియంత్రణ వరకు అనేక వ్యాధులకు చికిత్స చేయడంలో బాగా సహాయపడతాయి. కానీ అధికశాతం మంది వేయించిన డ్రై ఫ్రూట్స్(Fried dry fruits) తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా కాజు, బాదం, పిస్తా వేయించిన డ్రై ఫ్రూట్స్ లో మొదటివరుసలో ఉంటాయి. ఇవి చాలా రుచిగానూ, మంచి సువాసనను కలిగి ఉంటాయి. పైపెచ్చు వేయించిన డ్రై ఫ్రూట్స్ కు కాసింత ఉప్పు కూడా ఉంటుంది. ఇది రుచిని ఇనుమడింపజేస్తుంది. మామూలు డ్రై ఫ్రూట్స్ కంటే వేయించిన డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు కరకరలాడతాయి. పైగా ఇవి సులభంగానే జీర్ణం అవుతాయి. కానీ డ్రై ఫ్రూట్స్ ను వేయించడం వల్ల వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు తగ్గిపోతాయి. అధిక ఉష్టోగ్రతకు గురికావడం వల్ల ఇలా జరుగుతుంది.

Viral Video: స్వీట్లంటే ఇష్టమా? ఆగ్రా ఫేమస్ అయిన ఓ స్వీట్ ను ఎలా తయారుచేస్తున్నారో చూస్తే..



వేయించిన డ్రై ఫ్రూట్స్ లో ట్రాన్స్ ప్యాట్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వీటికి ఉన్న ఉప్పు రక్తపోటును ప్రభావితం చేస్తుంది. పచ్చిగా ఉన్న డ్రై ఫ్రూట్స్ ను తినడానికి ఇష్టపడనివారు మార్కెట్లో దొరికే వేయించిన డ్రై ఫ్రూట్స్ ను కొనకుండా ఇంట్లోనే వేయించకుని తినడం మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. కానీ వీటికి అలవాటుపడటం మాత్రం అస్సలు మంచిది కాదు.

Viral Video: 30నిమిషాల్లో ఈ ఆమ్లెట్ తింటే లక్షరూపాయలు మీవే.. ఇంతకీ దీన్నెలా తయారు చేశారో మీరే చూడండి!!


Updated Date - 2023-10-12T16:09:15+05:30 IST