Dubai Ruler: ఓ భారతీయ కుటుంబానికి షాకింగ్ అనుభవం.. ఇక్కడేం చేస్తున్నారంటూ దుబాయి రాజే వచ్చి పలకరించడంతో..!
ABN , First Publish Date - 2023-07-18T19:13:45+05:30 IST
సాధారణంగా ఓ దేశాన్ని పాలించే అధ్యక్షుడు లేదా ప్రధానిని సామాన్యులు కలవడం చాలా కష్టం. కట్టుదిట్టమైన భద్రత లేకుండా వారు అసలు కాలు బయటపెట్టారు. ఎన్నోసార్లు అపాయింట్‌మెంట్ తీసుకుంటే తప్ప వారిని నేరుగా కలవడం కష్టం. అలాంటి ఓ భారతీయ కుటుంబానికి దుబాయ్ ప్రధానితో షాకింగ్ అనుభవం ఎదురైంది.
సాధారణంగా ఓ దేశాన్ని పాలించే అధ్యక్షుడు లేదా ప్రధానిని సామాన్యులు కలవడం చాలా కష్టం. కట్టుదిట్టమైన భద్రత లేకుండా వారు అసలు కాలు బయటపెట్టారు. ఎన్నోసార్లు అపాయింట్‌మెంట్ తీసుకుంటే తప్ప వారిని నేరుగా కలవడం కష్టం. అలాంటిది సెలవు రోజులు గడిపేందుకు భార్య, పిల్లలతో కలిసి దుబాయ్ వెళ్లిన ఓ వ్యక్తికి అక్కడి హోటల్‌లో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆ వ్యక్తి హోటల్ లిఫ్ట్‌లో తన కుటుంబంతో కలిసి వెళ్తుండగా ఏకంగా దుబాయ్ ప్రధాని (Dubai Ruler) ప్రత్యక్షమయ్యారు. లిఫ్ట్‌లో ఆ వ్యక్తి కుటుంబంతో కలిసి ఫొటోలు దిగారు.
ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త, వెల్త్ రిసెర్చ్ ఏజెన్సీ ``హరూన్ ఇండియా`` వ్యవస్థాపకుడు అయిన అనస్ రెహ్మాన్ జునైద్ ఇటీవల తన కుటుంబంతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ``అట్లాంటిస్ ది రాయల్`` (Atlantis The Royal) హోటల్‌లో దిగారు. గత శనివారం అనస్ తన కుటుంబంతో కలిసి లిఫ్ట్‌లో కిందకు దిగుతుండగా షాకింగ్ అనుభవం ఎదురైంది. లిఫ్ట్ (Elevator) 22వ ఫ్లోర్‌కు చేరుకోగానే అందులోకి దుబాయ్ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ (Sheikh Mohammed bin Rashid Al Maktoum) ప్రవేశించారు. సాధారణంగా ప్రధాని వంటి వారు హోటల్స్‌కు వస్తే సెక్యూరిటీని కట్టుదిట్టం చేస్తారు. లిఫ్ట్‌లో వెళ్లాల్సి వచ్చినపుడు లోపల వేరెవరూ లేకుండా చూస్తారు. కానీ, రషీద్ అల్ మక్తూమ్ మాత్రం చాలా సామాన్య పౌరుడిలా ప్రవర్తించారు (Dubai Ruler met Indian family).
NRI: కెనడాలో కొడుకు నిర్వాకం.. సొంతూళ్లో ఓ తండ్రికి ఊహించని కష్టం.. 20 మంది వ్యక్తులు వచ్చి దాడి చేస్తే..!
అనస్ కుటుంబంతో కలిసి లిఫ్ట్‌లో చాలా నిరాడంబరంగా ప్రయాణించారు. అనస్ కుటుంబంతో కలిసి ఫొటోలు దిగారు. ``నేనెవరో తెలుసా?`` అంటూ అనస్ పిల్లలను అడిగారు. వారు సెల్ఫీ అడగ్గానే ``నో`` చెప్పకుండా వారితో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. అనస్ కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారితో స్నేహపూర్వకంగా ముచ్చటించి తన ఫ్లోర్ రాగానే దిగి వెళ్లిపోయారు. ఆ షాకింగ్ అనుభవం అనస్ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిర చేసింది. అంత పెద్ద హోదాలో ఉన్నా రషీద్ అల్ మక్తూమ్ చాలా నిరాడంబరంగా ప్రవర్తించారని, ఇది తమకు జీవిత కాల అనుభూతి అని అనస్ పేర్కొన్నారు.