TCS: వర్క్ ఫ్రమ్ హోమ్‌కి ముగింపుతో టీసీఎస్‌కు ఊహించని పరిస్థితి.. మహిళా ఉద్యోగులు అనూహ్యంగా..
ABN , First Publish Date - 2023-06-13T22:49:19+05:30 IST
వర్క్ ఫ్రమ్ హోమ్‌కి ముగింపు పలకడం దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు (TCS) కొత్త చిక్కులు తీసుకొచ్చింది. మహిళా ఉద్యోగుల్లో ఎక్కువమంది ఆఫీస్‌కు వచ్చి పనిచేసేందుకు సుముఖంగా లేరు. అవసరమైతే వేరే కంపెనీలో చేరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని యోచిస్తున్నారట. ఫలితంగా మునుపెన్నడూలేని విధంగా టీసీఎస్ నుంచి ఇతర కంపెనీల్లోకి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు వెళ్తున్నారు.

కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ముగింపు పలికాక టీసీఎస్‌లో అట్రిషన్ రేటు (కంపెనీని వీడి వెళ్లే ఉద్యోగులు) పెరిగినట్టు స్పష్టమవుతోంది. అసాధారణంగా పురుషులతో సమానంగా మహిళా ఉద్యోగులు కంపెనీని వీడి వెళ్లిపోతున్నట్టు టీసీఎస్ మానవ వనరుల చీఫ్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ గతవారమే విడుదలైన కంపెనీ వార్షిక రిపోర్టులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. కంపెనీలో లింగ సమతుల్యత కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఎదురుదెబ్బగా మిలింద్ లక్కడ్ అభివర్ణించారు.
కాగా.. వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యం కారణంగా కంపెనీలు ఇంతకాలం నైపుణ్యమున్న ఉద్యోగులను ఆకర్షించగలిగాయి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడాన్ని సౌకర్యవంతంగా భావిస్తున్నారు. అయితే అలవాటు పడిన తర్వాత ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని చెబుతుండడంతో అసౌకర్యానికి గురవుతున్నారు.