Viral Video: పాపం.. ఆ రైతు దగ్గర క్రొత్త ట్రాక్టర్ కొనేందుకు డబ్బులు లేవు.. తెలివి ఉపయోగించి ఏం చేశాడో చూడండి..

ABN , First Publish Date - 2023-08-26T16:15:35+05:30 IST

అవసరం అన్నింటినీ సృష్టించింది. అవసరమైన దానిని దక్కించుకునేందుకు మన బుర్ర అద్భుతంగా పని చేస్తుంది. ఫలితంగా కొత్త ఆవిష్కరణలు బయటకు వస్తాయి. అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యం అయిపోతుంది. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Viral Video: పాపం.. ఆ రైతు దగ్గర క్రొత్త ట్రాక్టర్ కొనేందుకు డబ్బులు లేవు.. తెలివి ఉపయోగించి ఏం చేశాడో చూడండి..

అవసరం అన్నింటినీ సృష్టించింది. అవసరమైన దానిని దక్కించుకునేందుకు మన బుర్ర అద్భుతంగా పని చేస్తుంది. ఫలితంగా కొత్త ఆవిష్కరణలు (Inventions) బయటకు వస్తాయి. అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యం అయిపోతుంది. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad videos) ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం బీహార్‌ (Bihar)కు చెందిన ఓ రైతు (Farmer) రూపొందించిన దేశీ ట్రాక్టర్‌ (Desi tractor)కు సంబంధించిన వీడియో నెటిజన్లు ఆకట్టుకుంటోంది. కొత్త ట్రాక్టర్ కొనేందుకు డబ్బుల్లేక ఆ రైతే స్వయంగా ఓ ట్రాక్టర్ తయారు చేసేశాడు.

బీహార్‌కు చెందిన వినోద్ అనే 50 ఏళ్ల రైతు వద్ద కొత్త ట్రాక్టర్ కొనడానికి తగినంత డబ్బు లేదు. అందుకే తానే స్వయంగా ట్రాక్టర్‌ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో పనికి రాకుండా పడి ఉన్న పంపింగ్‌సెట్ ఇంజిన్‌తో పాటు పనికి రాని స్క్రాప్ మెటీరియల్‌తో ట్రాక్టర్‌ను తయారు చేశాడు. ట్రాక్టర్ ముందు చక్రం తప్ప మొత్తం అంతా పాత ఇనుముతోనే తయారైంది. వెల్డింగ్ చేసి ట్రాక్టర్ ఫ్రేమ్‌ను సిద్ధం చేసి దానికి పంపింగ్ సెట్ మిషన్ ఇంజన్ జోడించాడు (Bihar farmer made desi tractor).

Viral Video: ఏంది సామీ ఇది.. గొడుగు పట్టుకుని బస్సు నడుపుతున్న డ్రైవర్.. మహారాష్ట్ర బస్సుల దుస్థితిపై నెటిజన్ల సెటైర్లు!

ఈ ట్రాక్టర్ నాలుగు లీటర్ల డీజిల్‌తో ఎకరం పొలాన్ని దున్నగలదని వినోద్ తెలిపాడు. దీనితో సాధారణ ట్రాక్టర్‌లా అన్ని పనులు చేయవచ్చని తెలిపారు. దీని నిర్మాణానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు చేశామని, సుమారు ఏడాది శ్రమించి దీనిని తయారు చేశామని ఆయన చెప్పారు. అలాంటి ట్రాక్టర్లను తయారు చేయమని స్థానిక రైతుల నుంచి వినోద్‌కు ఆర్డర్లు వస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ రైతు తెలివి తేటలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - 2023-08-26T16:15:35+05:30 IST