Viral Video: రైతే కదా అని చులకనగా చూడకండి.. పొలంలో ఈ సెట్టింగ్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-08-13T15:18:16+05:30 IST

వ్యవసాయం చేయాలంటే నీటి వసతి అతి ముఖ్యం. నీటి వసతి లేని ఎంతో మంది రైతులు వర్షాలపై ఆధారపడుతుంటారు. కొందరు మాత్రం సరికొత్తగా ఆలోచించి తమ పొలాలకు నీరు అందిస్తుంటారు. వ్యయసాయాన్ని అర్థం చేసుకున్న వారు తరచుగా కొత్త పద్ధతులను అన్వేషించి మంచి దిగుబడి సాధిస్తుంటారు.

Viral Video: రైతే కదా అని చులకనగా చూడకండి.. పొలంలో ఈ సెట్టింగ్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్

వ్యవసాయం (Farming) చేయాలంటే నీటి వసతి (Water fecility) అతి ముఖ్యం. నీటి వసతి లేని ఎంతో మంది రైతులు (Farmers) వర్షాలపై ఆధారపడుతుంటారు. కొందరు మాత్రం సరికొత్తగా ఆలోచించి తమ పొలాలకు నీరు అందిస్తుంటారు. వ్యయసాయాన్ని అర్థం చేసుకున్న వారు తరచుగా కొత్త పద్ధతులను అన్వేషించి మంచి దిగుబడి సాధిస్తుంటారు. అందుకోసం అవసరమైతే వారే ఇంజినీర్లుగా మారతారు. అలాంటి ఎంతో మంది రైతుల ప్రతిభ సోసల్ మీడియా ద్వారా అందుబాటులోకి వచ్చింది (New Invention).

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆ రైతు ఆలోచనకు ఫిదా కాక తప్పదు. IRS అధికారి MeenasSugrive ఈ వీడియోను తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఆ వీడియో ప్రకారం.. ఓ పొలంలో చేతి పంపు మాత్రమే ఉంది (water pump). కరెంట్ లేదు, డీజిల్‌తో నడిచే మోటార్ లేదు. దీంతో ఆ రైతు చాలా చవకగా కరెంట్ కూడా లేకుండా ఓ మోటార్‌ను తయారు చేశాడు. పొలంలో ఉన్న బోరుకు మోటార్‌ను అమర్చాడు. దాని ఎదురుగా ఓ చక్రంతో కూడిన మోటార్ అమర్చాడు. ఓ కుర్రాడు ఆ చక్రాన్ని కాసేపు తిప్పగానే మోటార్ లోపలి నుంచి నీరు బయటకు వచ్చింది (Jugaad Videos).

Viral Video: పాపం.. పెంపుడు కుక్కను రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయాడు.. ఆ తర్వాత అతడి పరిస్థితి ఏమైందంటే..

ఆ నీరు నేరుగా ఆ చక్రంపై పడడంతో అది టర్బైన్‌లా తిరుగుతూ ఉంది. దాని నుంచి కరెంట్ రావడమే కాకుండా, నీరు అంతా పొలంలోకి వెళ్లిపోతుంది. ఆ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఆ రైతు తెలివిని పొగడకుండా ఉండలేకపోతున్నారు. చాలా తక్కువ ఖర్చుతో అద్భుతంగా పని చేస్తోందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - 2023-08-13T15:18:16+05:30 IST