Fast Weight Loss Diet: బరువు తగ్గేందుకు ఏదేదో చేస్తుంటారు కానీ.. అత్యంత సులభమైన మార్గమేదో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ABN , First Publish Date - 2023-03-16T18:28:04+05:30 IST

ఈ ఒక్క డైట్ ఫాలో అయితే కిలోల కొద్ది బరువు సునాయాసంగా తగ్గచ్చు..

Fast Weight Loss Diet: బరువు తగ్గేందుకు ఏదేదో చేస్తుంటారు కానీ.. అత్యంత సులభమైన మార్గమేదో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ప్రస్తుత కాలంలో అధికశాతం మందిని వేధిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే అది అధిక బరువు. శరీర ఎత్తుకు మించి బరువు ఉంటే జబ్బులన్నీ ఆ శరీరం వైపు క్యూ కడతాయి. అధికబరువుతోనే మధుమేహం(Diabetes), కీళ్లు అరిగిపోవడం(Screaming Joints), కొలెస్ట్రాల్ సమస్యలు(Cholesterol Problems), గుండెజబ్బులు(Heart Problems) చాలా తొందరగా వస్తాయి. అందుకే బరువు తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడెక్కడో కనిపించిన చిట్కాలన్నీ ఫాలో అవుతారు. కానీ అంత గొప్ప ఫలితం కనిపించదు. అయితే ఈ ఒక్క మార్గం ఫాలో అయితే సులభంగా.. వేగంగా బరువు తగ్గచ్చు. దీనికి సంబంధించి వివరంగా తెలుసుకుంటే..

బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేసేవారికి వేసవికాలం మంచి ఆప్షన్. ఈ వేసవిలో శరీరంలో ఉన్న కొవ్వు వేగవంతంగా కరుగుతుంది. అయితే దీనికి తగినట్టే తీసుకునే ఆహారం ఉండాలి. కేవలం ఒకే ఒక్క పదార్థాన్ని ఆహారంలో బాగా తీసుకుంటే ఈ ప్రయత్నం సులభమవుతుంది. ఆ పదార్థమే పెరుగు. పెరుగు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు(Health benefits) ఇన్నని చెప్పలేం. ఈ పెరుగు బరువు తగ్గిస్తుంగని తెలిస్తే షాకవుతారు. కానీ నిజమండీ బాబూ.. కిలోల కొద్ది బరువు కూడా ఎంతో సునాయాసంగా తగ్గించేయడంలో పెరుగు సహాయపడుతుంది.

పెరుగులో ప్రోటీన్లు(Proteins) సమృద్దిగా ఉంటాయి. ఈ ప్రోటీన్లు మన శరీరంలో కండరాల నిర్మాణానికి వాటి మరమ్మత్తుకు(Muscle growth and repair) సహాయపడతాయి. మనం ఎంత ఆహారం తీసుకున్నా చివరిలో పెరుగుతో భోజనం ముగిస్తే తృప్తి కలిగిన ఫీల్ వస్తుంది. దీన్ని బట్టి చూస్తే పెరుగును తీసుకుంటే కడుపునిండిన భావన(Stomach full feeling) తొందరగా అనిపిస్తుంది. మన శరీరంలో కొవ్వులను కరిగించడంలో సహాయపడుతుంది.

పెరుగులో కేలరీలు(Calories) తక్కువ. కేలరీలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే బరువు పెరగడమనే ప్రక్రియ ఆగుతుంది. ఎప్పుడైతే శరీరంలో బరువు పెరగడం ఆగుతుందో అప్పుడు బరువు తగ్గడం సులువు. సింపుల్ గా చెప్పాలంటే బరువు తగ్గాలంటే మొదట బరువు పెరగకుండా చూసుకోవాలి. పెరుగు అందుకు సహాయపడుతుంది.

పెరుగులో ప్రోబయోటిక్స్(Probiotics) ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు ఎంతో ఉపయోగపడతాయి(Help for digestion). రోగనిరోధకశక్తిని పెంచుతాయి(Increase immunity. రక్తంలో చక్కెర స్థాయిలు నిలకడగా ఉంటే బరువు పెరగడం జరగదు. ఇది నెమ్మదిగా జీర్ణమయ్యే పదార్థం. అందుకే పెరుగు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది(Control blood sugar levels).

పెరుగులో కాల్షియం(Calcium) పుష్కలంగా ఉంటుంది. ఈ కాల్షియం శరీరంలో ఉండే కోలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. కాల్షియం ఎక్కువ తీసుకునేవారు తొందరగా బరువు తగ్గుతారని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ఈ వేసవిలో ప్రతి రోజూ పెరుగు తీసుకుంటూ సులువుగా బరువు తగ్గండి.

Read also: Viral Video: మంచు చిరుత వేట ఎప్పుడైనా చూశారా? దాని పరుగు చూస్తే గూస్ బంప్స్ వస్తాయ్!


Updated Date - 2023-03-16T18:50:41+05:30 IST