Brain Teaser: ఈ ప్రశ్నకు 10 సెకన్లలో సమాధానం చెబితే మీ బ్రెయిన్ సూపర్ ఫాస్ట్!
ABN , First Publish Date - 2023-12-13T11:28:01+05:30 IST
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బ్రెయిన్ టీజర్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువైపోయాయి. ఏదో ఒక ఫోటో ఇచ్చి అందులో నుంచి ప్రశ్న అడుగుతున్నారు. కొంత సమయం లోగా జవాబు చెబితే మీ మెదడు చాలా చురుకుగా ఉందని చెబుతున్నారు.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బ్రెయిన్ టీజర్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువైపోయాయి. ఏదో ఒక ఫోటో ఇచ్చి అందులో నుంచి ప్రశ్న అడుగుతున్నారు. కొంత సమయం లోగా జవాబు చెబితే మీ మెదడు చాలా చురుకుగా ఉందని చెబుతున్నారు. దీనినే ఆప్టికల్ ఇల్యూషన్ అని, పజిల్స్ అని, వాడుక భాషలో మెదడుకు మేత అని అంటుంటారు. మన మెదడుకు తగినంత పని చెప్పి చురుకుగా తయారు చేసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. తద్వారా మొద్దు బారిన మెదడు కూడా చురుకుగా పని చేసే అవకాశాలుంటాయి. అలాంటిదే ప్రస్తుతం మరొక బ్రెయిన్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ బొమ్మలతో కూడిన ఫోటో ఇచ్చి అందులోని 5 బాల్ ఆర్నామెంట్స్‌ను గుర్తించమని అడిగారు. ఇందుకు 10 సెకన్లు మాత్రమే సమయం ఇచ్చారు. దీనికి స్పందించిన అనేక మంది నెటిజన్లు సమాధానాలు కూడా ఇచ్చారు. తమ సమాధానాలను కామెంట్స్ బాక్స్‌లో చెప్పారు.
అన్ని ఒకే రంగులో లేవని, కానీ చివరికి తాను 5 బాల్ ఆర్నామెంట్స్ కనుగొన్నానని ఒక నెటిజన్ చెప్పాడు. నాకు కొంత సమయం పట్టిందని, కానీ చివరికి కనుగొన్నాని మరొకరు అన్నారు. అందులో 3 ఎరుపు, 2 ఆకుపచ్చ బాల్ ఆర్నామెంట్స్ ఉన్నాయని మరొకరు కామెంట్ చేశారు. మరొక వ్యక్తి ఏమో తాను మొదటి నాల్గింటిని త్వరగానే కనుగొన్నానని ఐదో దాని కోసం ఎక్కువ సమయం పట్టిందని అన్నారు. మరొకరు 5 బాల్ ఆర్నామెంట్స్ కనుగొనడానికి తనకు 25 నిమిషాల సమయం పట్టిందని చెప్పారు. ఆ బ్రెయిన్ టీజర్‌ను ఇక్కడ ఇచ్చాం. నిజానికి మీకు కూడా 10 సెకన్లు మాత్రమే సమయం ఉంది. కాబట్టి మీరు కూడా ఈ బ్రెయిన్ టీజర్‌లో 5 బాల్ ఆర్నామెంట్స్‌ను కనుక్కోండి. ఎంత సమయంలో సమాధానం చెప్పగల్గుతారో చూద్దాం. ఒకవేళ 10 సెకన్లలోపే మీరు సమాధానం చెప్పగల్గితే మీ బ్రెయిన్ సూపర్ ఫాస్ట్ అనుకోవచ్చు.